Orange juice in summer: ప్రతిరోజు ఎండకాలం ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల మన శరీరానికి ప్రయోజనాలు కలుగుతాయి. ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. సీజనల్ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతాయి. అంతేకాదు ఆరెంజ్ లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ ని కూడా పెంచుతుంది. ఆరెంజ్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యానికి కూడా ప్రేరేపిస్తుంది. వేసవి వేడిలో ఆరంజ్ జ్యూస్ తప్పనిసరిగా మీ డైట్లో చేర్చుకోవాలి. దీంతో శక్తివంతంగా ఉంటారు. ప్రతిరోజు ఒక గ్లాస్ ఆరేంజ్‌ జ్యూస్‌ తీసుకోవడం వల్ల మీకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుండె ఆరోగ్యం..
ప్రతిరోజు ఎండలో ఆరంజ్ తీసుకోవడం వల్ల ఇందులో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తగ్గిస్తుంది. అంతే కాదు రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ని తగ్గించే సమర్థవంతమైన శక్తి ఆరెంజ్ ఉంది. దీంతో హార్ట్ ఎటాక్ సమస్యలు రావని ఎన్ హెచ్ ఐ తెలిపింది.


ఇదీ చదవండి:స్ట్రాబెర్రీలు తింటున్నారా? అయితే, మీకు ఈ 5 రోగాలు దరిచేరవు..


క్యాన్సర్..
ఆరంజ్ లో ఫైబర్ అధికంగా మోతాదులో ఉంటుంది. ఇది కడుపు సంబంధిత క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఆ కణాల అభివృద్ధి కాకుండా పనిచేస్తుంది. ఆరెంజ్ మీ డైట్లో చేర్చుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకానికి కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.


బరువు తగ్గుతారు..
 ఆరెంజ్ లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బరువు సులభంగా తగ్గుతారు. ఎక్కువ శాతం కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అందుకే అతిగా తినకుండా ఉంటారు. దీంతో వెయిట్ కూడా ఈజీగా తగ్గుతారు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు ఆరేంజ్ జ్యూస్‌ తప్పకుండా డైట్లో చేర్చుకోవాలి.


కిడ్నీలో రాళ్లు..
ఆరేంజ్‌లో విటమిన్ సీ పుష్కలంగా ఉండటం వల్ల ఇది కిడ్నీ రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది.  యూరిన్ సాఫీగా బయటకు వెళ్లేలా చేస్తుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది.


ఇదీ చదవండి:ఈ మండే ఎండలకు వేడి కాఫీ కాకుండా ఇలా కోల్డ్ కాఫీ తాగితే బోలెడు ప్రయోజనాలు..


 ఇమ్యూనిటీ..
ఆరోగ్యకరమైన విటమిన్ సి ఆరేంజ్‌లో పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది .అంతేకాదు సీజనల్‌ వ్యాధులు మీ దరిచేరకుండా ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరచడంలో కీలకపాత్ర పోషిస్తుందని ఎన్ఐహెచ్ తెలిపింది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి