Coffee vs Heart: కాఫీ..అతిగా తాగితే ఆ ప్రమాదం పొంచి ఉంటుందట...తాజా పరిశోధన
Coffee vs Heart: అతి ఎప్పుడూ మంచిది కాదు. ఆహారమైనా సరే..అలవాట్లైనా సరే. ఆఖరికి హాస్యమైనా సరే. నవ్వైనా సరే. ఏదైనా మితంగానే ఉండాలంటారు పెద్దలు. మరి కాఫీ విషయంలో మరీనూ. కాఫీ అతిగా తాగితే ఆ ప్రమాదం వెన్నాడుతుందంటున్నారు నిపుణులు.
Coffee vs Heart: అతి ఎప్పుడూ మంచిది కాదు. ఆహారమైనా సరే..అలవాట్లైనా సరే. ఆఖరికి హాస్యమైనా సరే. నవ్వైనా సరే. ఏదైనా మితంగానే ఉండాలంటారు పెద్దలు. మరి కాఫీ విషయంలో మరీనూ. కాఫీ అతిగా తాగితే ఆ ప్రమాదం వెన్నాడుతుందంటున్నారు నిపుణులు.
కాఫీ. బిజీ లైఫ్‌లో నిత్యభాగం. పల్లెల్లో కంటే పట్టణాల్లో..పట్టణాల్లో కంటే నగరాల్లో కాఫీ( Cofee )ఓ నిత్యకృత్యంగా మారిపోయింది. టీ అనేది ఇండియన్ కల్చర్ అయితే..కాఫీ అనేది పాశ్చాత్య సంస్కృతి. మనలో ఇప్పుడో భాగమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 3 వందల కోట్ల కప్పుల కాఫీ ( Per day 300 crores of cups coffee ) తాగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. అంతలా ప్రాచుర్యం పొందిన కాఫీ ఆరోగ్యానికి మంచిదా కాదా. మంచిదైతే ఎంత పరిమితి ఉండాలి. పరిమితి దాటితే అనర్దమా..కాదా. ఈ అన్ని ప్రశ్నలకు సమాధానమే ఇది.
యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా ( University of south australia ) పరిశోధకులు తాజా పరిశోధన ఫలితాల్ని వెల్లడించారు. ఇవి కాస్త ప్రమాదకరంగానే ఉన్నాయి మరి. ముఖ్యంగా కాఫీ విషయంలో. కాఫీ అనేది సిగరెట్, మద్యం లాంటిది కాదు కదా..ఎక్కువగా తాగితే అనర్ధమెందుకని ప్రశ్నించేవారున్నారు. కానీ సౌత్ ఆస్ట్రేలియా పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం కాఫీ అతిగా తాగితే ప్రమాదకరమే. ప్రతిరోజూ 5 కప్పులకు మించి కాఫీ తాగేవారు గుండె సంబంధిత రోగాల్నించి ( Coffee caused for heart problem ) తప్పించుకోలేరని పరిశోధకులు తేల్చి చెప్పేశారు. ప్రతిరోజూ ఐదు కప్పులకు మించి కాఫీ తాగుతున్నవారిలో..కాఫీలోని కఫెస్టోల్ అనే రసాయనం కారణంగా కొవ్వు పేరుకుపోతుందని వెల్లడించారు. ఈ కొవ్వు కారణంగా రక్త ప్రసరణ సరిగ్గా జరగక హృద్రోగాలు ( Heart diseases ) యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. దీనిపై తమ అధ్యయనం మరింతగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. సో..అతిగా కాఫీ తాగే అలవాటున్నవారు తస్మాత్ జాగ్రత్త. కాఫీ తాగవద్దని చెప్పడం లేదు. తగ్గించమంటున్నారంతే. రోజుకు 2 లేదా అత్యధికంగా అంటే 3 కప్పులు అంతే. అంతకంటే ఎక్కువ మంచిది కాదట మన గుండెకు.
Also read: Green Tea: మీ శరీరంలో విష పదార్ధాల్ని దూరం చేసే దివ్యౌషధం..గ్రీన్ టీ..ఎలాగో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook