Oxygen in Blood: మనిషి రక్తం ఎంత అవసరమో రక్తంలో ఆక్సిజన్ కూడా అంతే అవసరం. రక్తంలో ఆక్సిజన్ కొరత ఉందంటే పెద్ద ముప్పే పొంచి ఉందని అర్ధం. ఈ క్రమంలో మీ డైట్‌లో ఎలాంటి పండ్లు, కూరగాయలు ఉండాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఇటీవలి కాలంలో రక్తంలో ఆక్సిజన్ లోపం కన్పిస్తోంది. ఫలితంగా సాధారణ పనులు చేసుకోవడంలో కూడా ఇబ్బంది ఎదురౌతుంటుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెంచాలంటే..ఆల్కలైన్ ఎక్కువగా ఉండే పదార్ధాలు తీసుకోవల్సి ఉంటుంది. మీకు కూడా ఈ విధమైన ఇబ్బంది ఉంటే..ఈ పదార్ధాల్ని డైట్‌లో చేర్చుకోండి.


కొన్నిరకాల పండ్లు, కూరగాయలతో రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెంచవచ్చని ప్రముఖ న్యూటిషియన్ నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్ లోపాన్ని తగ్గించేందుకు ఏ విధమైన పండ్లు, కూరగాయలు తీసుకోవాలో పరిశీలిద్దాం..


నిమ్మకాయ ముఖ్యమైంది. ఎక్కువగా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలున్నప్పుడు వినియోగిస్తుంటారు. కానీ నిమ్మకాయ అనేది బెస్ట్ ఆక్సిజన్ సోర్స్ కలిగి ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతిరోజూ తప్పకుండా డైట్‌లో నిమ్మకాయ ఉండాలి. 


ఇక మామిడిపండ్లు, బొప్పాయి కూడా రక్తంలో ఆక్సిజన్ స్థాయిని వేగంగా పెంచుతాయి. మామిడిపండ్లు కేవలం వేసవిలోనే లభించినా..బొప్పాయి ఏడాది మొత్తం దొరుకుతుంది. ఈ రెండు పండ్ల వల్ల ఆక్సిజన్ స్థాయి పెరగడమే కాకుండా..కిడ్నీల్ని కూడా క్లీన్ చేస్తాయి.


పైనాపిల్, కిస్మిస్‌లను రోజూ డైట్‌లో భాగంగా చేసుకుంటే రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే వీటిలో పీహెచ్ లెవెల్ 8.5 ఉంటుంది. ఇవి తినడం వల్ల విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.


ఇక ఆక్సిజన్ లెవెల్స్ పెంచేందుకు ఇంకా చాలా పదార్ధాలున్నాయి. అందులో వెల్లుల్లి, అరటిపండ్లు, నేరేడుపండ్లు, ఖర్జూరం, కేరట్ వంటివి రోజూ కాకపోయినా వారానికి 3-4 సార్లు తీసుకున్నా మంచి ఫలితాలుంటాయి.


Also read: Diabetes Control Tips: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ టీలతో మధుమేహానికి చెక్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook