Painkiller Side Effects: పెయిన్ కిల్లర్స్ తో జాగ్రత్త.. అతిగా వాడితే అంతే సంగతులు!
Painkiller Side Effects: అధికంగా నొప్పి నివారణ మాత్రలు (పెయిన్ కిల్లర్స్) వాడడం అనేక సమస్యలకు దారితీయోచ్చు. అయితే అతిగా పెయిన్ కిల్లర్స్ వాడడం పట్ల తగిన జాగ్రత్త వహించాలి. వాటి వల్ల ప్రాణాంతక సమస్య వాటిల్లే అవకాశం ఉంది.
Painkiller Side Effects: సాధారణంగా తలనొప్పి, మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి, చేతి నొప్పులకు అంటూ రోజూ చాలా మంది పెయిన్ కిల్లర్ మాత్రలను వాడుతుంటారు. అయితే మితిమీరిన పెయిన్ కిల్లర్స్ మీ ప్రాణాన్ని విషంలా చంపేస్తాయని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే! అతిగా నొప్పి నివారణ మాత్రలను వినియోగించడం పట్ల జాగ్రత్త వహించాలి. వాటి వల్ల ప్రాణాంతకం కూడా కావొచ్చు. అయితే పెయిన్ కిల్లర్స్ ను ఎలా నివారించాలో తెలుసుకుందాం.
పెయిన్‌కిల్లర్స్‌తో సమస్యలు..
- అనాల్జేసిక్ మాత్రలు ఎక్కువగా వాడే వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ కిడ్నీ, లివర్ దెబ్బతింటుంది.
- అంతేకాకుండా కడుపులో రక్తస్రావం కూడా కావచ్చు.
- హఠాత్తుగా రక్తపోటు తగ్గడం, అలసట, మలబద్ధకం మిమ్మల్ని వెంటాడతాయి. కాబట్టి అవసరమైతే తప్ప పైన్ కిల్లర్ మాత్రలు తీసుకోకుండా ప్రయత్నించాలి. దీంతోపాటు వైద్యులను సంప్రదించకుండా ఏ కారణం చేతనూ పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకోవద్దు.
ప్రాణాంతకమైన పెయిన్ కిల్లర్స్..
- పెయిన్ కిల్లర్స్ తరచుగా వాడితే ప్రాణాపాయం తప్పదు. అందువల్ల చిన్న చిన్న నొప్పులకు ట్యాబ్ లెట్స్ ను వాడకపోవడమే మంచిది. ఏదైనా భరించలేని నొప్పి వస్తే.. వైద్యుని సలహ మేరకు పెయిన్ కిల్లర్స్ వాడొచ్చు.
- పెయిన్ కిల్లర్స్ ను తీసుకున్న తర్వాత కడుపులో నొప్పి చాలాసార్లు వ్యక్తమవుతుంది. ఈ సందర్భంలో వాటిని యూజ్ చేయకపోవడమే మంచిది.
- అదే విధంగా గర్భధారణ సమయంలో నొప్పి నివారణ మాత్రలను వాడకం మరింత ప్రమాదకరం.
- ఏ రకమైన గుండె సమస్య ఉన్నవారు నొప్పి నివారణ మందులు వేసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి.
- అలాగే బీపీ, మధుమేహం, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా లేకుండా పైన్ కిల్లర్ మాత్రలు వాడకూడదు.
- మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నొప్పి నివారిణిని ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల మీ మూత్రపిండాలు, కాలేయం మరియు పొట్ట దెబ్బతింటుంది.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Milk Side Effects: ఈ అనారోగ్య సమస్యలతో బాధపడే వారు పాలు అసలు తాగొద్దు!
Also Read: Almond Oil Benefits: ముఖం కాంతిమంతంగా మెరవాలంటే ఈ టిప్ ను కచ్చితంగా పాటించండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook