Papaya For Weight Loss In 7 Days: బరువు తగ్గాలనే కోరికలు అందరికీ ఉంటాయి. అయితే ప్రస్తుతం  చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మంది వివిధ రకాల వ్యాయామాలు, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించిన బరువు తగ్గలేకపోతున్నారు. అయితే బరువు తగ్గే క్రమంలో పలు రకాల నియమాల్లో పలు రకాల ఆహారాలతో కొన్ని ముఖ్యమైన పండ్లు తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం సులభంగా లభించే బొప్పాయి తినడం చాలా మంచిది. ఈ పండ్లతో చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి మంచి లాభాలు ఉండడమేకాకుండా బరువు సులభంగా తగ్గుతారు. అయితే ఈ పండు వల్ల శరీరానికి లభించే మరికొన్ని ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బొప్పాయి తింటే ఇలా సులభంగా బరువు తగ్గడం ఖాయం:
బొప్పాయిలో శరీరానికి అవసరమైన పోషకాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. అయితే ఇందులో శరీర బరువును తగ్గించే.. పాపైన్ ఎంజైమ్‌లు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి బొప్పాయి పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు తెలుపుతున్నారు.


బొప్పాయి ఆహారంగా ఎలా తీసుకోవాలి:
అల్పాహారం:

ఉదయం అల్పాహారంలో భాగంగా  బొప్పాయితో చేసిన ఆహారాలను తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఇది శరీరానికి కావాల్సిన పోషకాలను ఇస్తుంది. అయితే దీనిని ఓట్ మీల్‌తో కూడా తీసుకోవచ్చని ఇలా తీసుకుంటే సులభంగా బరువు తగ్గడమేకాకుండా శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి.


భోజనంలో భాగంగా:
మధ్యాహ్నం తీసుకునే భోజనంలో ముఖ్యంగా  సలాడ్ తీసుకుంటే బాడీకి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సలాడ్స్‌ను తయారు చేసుకునే క్రమంలో బచ్చలికూర, టొమాటో, ఉప్పు, వెల్లుల్లి, నిమ్మరసం చేర్చుకుంటే మీరు అనుకున్నంత బరువు తగ్గగలుగుతారు.


సాయంత్రం పూట ఇలా తీసుకోవాలి:
సాయంత్రం పూట కూడా బొప్పాయితో చేసిన ఆహారాలను తీసుకుంటే.. ఆకలిని నియంత్రించి బాడీని యాక్టివ్‌గా చేస్తుంది. ముఖ్యంగా వీటిని పైనాపిల్‌తో చేసిన జ్యూస్‌లో కలుపుకుని తాగడం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.


రాత్రి ఆహారంలో వీటిని ఇలా తీసుకోవాలి:


రాత్రి భోజనం చేసిన తరువాత బొప్పాయితో చేసిన స్వీట్ డిష్‌గా తీసుకుంటే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిలను సులభంగా నియంత్రిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.



(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: ఓటీటీకి సిద్దమైన 'కార్తికేయ‌ 2'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులోనో తెలుసా?


Also Read: షమీ, చహర్‌లకు షాక్.. డీకేకు చోటు! టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.