Weight Loss Tips: బొప్పాయితో వేగంగా ఇలా 12కిలోల బరువు తగ్గొచ్చు.
Papaya For Weight Loss: ప్రస్తుతం చాలా మంది శరీర బరువు పెరుగుతున్నారు. అయితే ఈ బరువును తగ్గించుకోవడానికి బొప్పాయి పండును డైట్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Papaya For Weight Loss: బరువు తగ్గడం అనేది ఎంత పెద్ద సమస్యయో అందరికీ తెలిసిందే..అయితే ప్రస్తుతం శరీర బరువును తగ్గించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు బరువు తగ్గలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతోనే బాధపడుతుంటే తప్పకుండా పలు ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారంలో పలు రకాల పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డైట్‌లో బొప్పాయిని తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ పండును డైట్‌లో తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి తింటే బరువు తగ్గుతారా?:
బొప్పాయిలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరంలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. అంతేకాకుండా బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ బొప్పాయి పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది.
బొప్పాయిని డైట్‌లో ఎలా తీసుకోవాలి:
బరువు తగ్గడానికి అల్పాహారం నుంచే బొప్పాయి పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉదయం తీసుకునే అల్పాహారంలో సలాడ్స్ తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఓట్ మీల్ కూడా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Jio Cinema Charges: జియో సినిమాకు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే.. ఐపీఎల్ 203 మాత్రం..!
లంచ్‌లో కూడా బొప్పాయి సలాడ్ తినవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సాలడ్ తప్పకుండా పాలకూర, టొమాటో, ఉప్పు, వెల్లుల్లి, నిమ్మరసం కలిపి తీసుకుంటేనే మంచి ఫలితాలు పొందుతారు. ఈ సాలడ్ తీసుకున్న తర్వాత బొప్పాయితో తయారు చేసిన జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు.
సాయంత్రం పూట ఇతర స్నాక్స్‌కి బదులుగా బొప్పాయిని తీకోవాల్సి ఉంటుంది. బొప్పాయి, పైనాపిల్‌లను ముక్కలుగా కట్ చేసి స్మూతీలా తయారు చేసి తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Jio Cinema Charges: జియో సినిమాకు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే.. ఐపీఎల్ 203 మాత్రం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.