Papaya Combinatin Precautions: బొప్పాయిని ఈ పండ్లతో కలిపి ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు
Papaya Combinatin Precautions: ప్రకృతిలో లభించే ఎన్నో రకాల పండ్లలో బొప్పాయి స్థానం ప్రత్యేకం. అద్భుతమై ఔషధ గుణాలు కలిగిన బొప్పాయి ఒక్కోసారి విషంగా మారుతుందందంటే నమ్మగలరా.. ఎందుకు, ఏ పరిస్థితుల్లోనో తెలుసుకుందాం..
Papaya Combinatin Precautions: బొప్పాయి అద్బుతమైన రుచి కలిగిన ట్రోపికల్ ఫ్రూట్. ఇందులో ఉండే పోషక పదార్ధాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందుకే వీటిని ఏంజెల్ ఫ్రూట్స్‌గా పిలుస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఖనిజాలు పుష్కలంగా ఉన్నా..కొన్ని సందర్భాల్లో విషంగా మారి ప్రాణాంతకం కాగలదు.
బొప్పాయి ఓ హెల్తీ డైట్. శరీరంలోని చాలా వ్యాధుల నుంచి కాపాడుతుంది. కానీ కొన్ని ఫ్రూట్స్‌తో కలిపి తినడం వల్ల బొప్పాయి విషంగా మారిపోతుంది. అందుకే బొప్పాయితో కలిపి వాటిని పొరపాటున కూడా తినకూడదు. ఒకవేళ తింటే విషంగా మారి ప్రాణాంతకం కావచ్చు.
నిమ్మకాయ
బొప్పాయి, నిమ్మకాయ రెండూ హెల్తీ ఫ్రూట్స్. కానీ ఈ రెండింటినీ ఒకేసారి కలిపి తినకూడదు. ఇది మంచి పద్దతి కాదు. బొప్పాయి సలాడ్ తీసుకునే అలవాటుంటే అందులో నిమ్మరసం కలిస్తే విషంగా మారుతుంది. నిమ్మరసం , బొప్పాయి కలిపి తీసుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్‌పై దుష్ప్రభావం పడవచ్చు. ఫలితంగా ఆ వ్యక్తి ఎనీమియాకు బలవుతాడు.
పాలు
బొప్పాయిలో పపైన్ పేరుతో ఓ ఎంజైమ్ ఉంటుంది. ఇది పాలలోని ప్రోటీన్‌ను శరీరంలో విభజించగలదు. ఫలితంగా అజీర్ణం, స్వెల్లింగ్ ఇతర జీర్ణక్రియ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. అందుకే పాలు, బొప్పాయి కలిపి ఎన్నడూ తీసుకోకూడదు.
అరటి పండ్లు
అరటి పండ్లను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో పోషక గుణాలు చాలా ఎక్కువ. కానీ బొప్పాయి కాంబినేషన్‌లో అరటి పండ్లు తినకూడదంటారు. బొప్పాయితో కలిపి తినడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావచ్చు.
ఆరెంజ్
ఆరెంజ్ కూడా నిమ్మ జాతికి చెందిందే. ఫ్రూట్ సలాడ్‌లో బొప్పాయి, ఆరెంజ్ ఒకేసారి కలిపి తినకూడదు. అలా తింటే విషపూరితం కావచ్చు. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. అందుకే బొప్పాయితో ఆరెంజెస్ కలిపి తినడం మంచిది కాదు.
Also read: Diabetes Tips: టైప్ 2 డయాబెటిస్ సమస్యకు అద్భుత ఔషధం, నెల రోజుల్లో మధుమేహానికి చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook