Peanut Butter: బరువు తగ్గాలనుకునేవారు ఇలా పీనట్ బట్టర్ కూడా తగ్గొచ్చు.. ఉదయం ఇలా తినండి చాలు..
Peanut Butter For Weight Loss: అల్పాహారంలో పీనట్ బట్టర్ వినియోగించడం వల్ల శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పీనట్స్ బట్టర్‌ను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
Peanut Butter For Weight Loss: ఆధుని జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అల్పాహారాలను తింటున్నారు. కొందరైతే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే అల్పాహారంలో పీనట్ బట్టర్‌తో పాటు పలు రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే చాలా మంది దీనిని సూపర్‌ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇందులో శరీరానికి కావాల్సిన ఫైబర్, ప్రోటీన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వులు కూడా ఉంటాయి. కాబట్టి చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఐరన్, జింక్, విటమిన్లు, పొటాషియం వంటి చాలా రకాల గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని ఆహారాల్లో తినడం వల్ల బరువు కూడా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిని ఆహారంలో తీసుకోవడం వల్ల బరువు ఎలా తగ్గుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పీనట్ బట్టర్ తినడం వల్ల 4 ప్రయోజనాలు:
1. ఆకలిని నియంత్రిస్తుంది:
బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఆకలిని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అయితే దీని కోసం మీరు ప్రతి రోజూ ఆహారంలో భాగంగా పీనట్ బట్టర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని ప్రతి రోజూ బ్రెడ్‌పై అప్లై చేసుకుని తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు శరీరానికి కలుగుతాయి. అంతేకాకుండా బాడీకి పోషకాలు అంది ఆకలి నియంత్రణలో ఉంటుంది.
2. బరువు తగ్గించడానికి సహాయపడుతుంది:
పీనట్ బట్టర్‌లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు మొదలైన అనేక పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని ఉదయం పూట అల్పాహారంలో తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్, ఫోలేట్ మూలకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వ్యాయామాలు, జిమ్ చేసేవారు ప్రతి రోజూ తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలతో పాటు మంచి శరీర అకృతిని పొందవచ్చు. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయి.
3. కళ్లకు మేలు చేస్తుంది:
పీనట్ బట్టర్ తినడం వల్ల శరీరానికే కాకుండా కళ్లకు చాలా రకాలుగా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి విటమిన్-ఎ అందించి కంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఆహారంలో దీనిని తీసుకోవాల్సి ఉంటుంది.
4. షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది:
పీనట్ బట్టర్ శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రోటిన్స్ లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ మధుమేహంతో బాధపడుతున్నవారు దీనిని తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: IPS Transfers: ఒకే దెబ్బకు తెలంగాణలో 91 మంది ఐపీఎస్‌ల బదిలీ.. అందుకేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook