Baby After An Abortion: అబార్షన్ తర్వాత పిల్లలు కావాలనుకున్నారా.. ఈ విషయాలు తెలుసా!
Planning a Baby After An Abortion: కొంతమందికి అనుకోకుండా జరిగితే, మరికొందరికి అనారోగ్య సమస్యలతో అబార్షన్ జరుగుతుంది. గర్భస్రావం తర్వాత శిశువును కనేందుకు సిద్ధంగా ఉన్నారా.. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Planning a Baby After An Abortion: గర్భస్రావం కొంతమందికి అనుకోకుండా జరిగితే, మరికొందరికి అనారోగ్య సమస్యలతో జరుగుతుంది. అప్పుడే తల్లిదండ్రులు కావాలని లేకపోతే, అందుకు ఇంకా సిద్ధంగా లేనందున కొందరు డాక్టర్లను సంప్రదించి అబార్షన్ చేయించుకుంటారు. మీరు గర్భస్రావం తర్వాత శిశువును కనేందుకు సిద్ధంగా ఉన్నారా.. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం ప్రణాళిక సిద్ధం చేసుకుని పాటించాలి.
గైనకాలజీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, గర్భస్రావం(Abortion) జరిగిన మూడు నెలల్లో మళ్లీ గర్భవతి(Pregnancy) కావడం సరైన నిర్ణయం కాదు. గర్భస్రావం కోసం వాడిన మెడిసిన్ వల్ల గర్భాశయం మృదువుగా ఉంటుంది. అంతేకాక, కొన్ని సందర్భాల్లో అబార్షన్ తరువాత అధిక రక్తస్రావం జరుగుతుంది. మరోవైపు గర్భస్రావం శస్త్రచికిత్స ద్వారా జరిగితే, అది స్త్రీ గర్భాశయం మరియు మొత్తం శరీరంపై ప్రభావం చూపుతుంది. కనుక గర్భస్రావం జరిగిన ఆరు నెలల వరకు కనీస సమయం వేచి ఉండాలని వైద్యులు సలహా ఇస్తారు.
Also Read: 5 Health Mistakes: 2021 నుంచి ఈ తప్పులు అసలు చేయవద్దు
గర్భస్రావం తర్వాత గర్భనిరోధకం తప్పనిసరి
అబార్షన్ జరిగిన తర్వాత కనీసం 6 నెలల వరకు పిల్లలు కనాలనే విషయానికి దూరంగా ఉండాలట. అందుకోసం వీరు గర్భనిరోధక ప్రత్యామ్నాయాలు వాడాలని భార్యాభర్తలకు సూచిస్తున్నారు. పీరియడ్స్ ఆగిపోతే వెంటనే వైద్యులను సంప్రదించి వారి సలహా తీసుకోవాలి.
Also Read: Hot Water Benefits: వేడి నీళ్లు తాగుతున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా?
గర్భస్రావం మీ సంతానోత్పత్తిని ప్రభావితం చేయదు
నిపుణులు అయిన వైద్యులు గర్భస్రావం చేయడం వల్ల ఏ సమస్య ఉండదు. వైద్య నిపుణులు అబార్షన్ చేయడం ద్వారా మీ పునరుత్పత్తి అవయవాలు గర్భసంచి, అండాశయాలు మరియు పాలోపియన్ గొట్టాలు ఏమాత్రం దెబ్బతినవు. మీ పునరుత్పత్తి అవయవాలు ప్రభావితం కావు కనుక, మీ సంతానోత్పత్తిపై అబార్షన్ తర్వాత ఇబ్బంది ఉండదు.
ఒకటి కంటే ఎక్కువ చేయించుకోవద్దు
సాధారణంగా అబార్షన్ చేయించుకోవద్దు. కానీ అనుకోని పరిస్థితులు, గర్భవతి అనారోగ్యం లాంటి పలు అంశాల కారణంగా మాత్రమే అబార్షన్ చేస్తారు. అయితే ఒకటి కంటే ఎక్కువసార్లు గర్భస్రావం కోసం వెళితే, మీ గర్భాశయము పైభాగంలో మచ్చలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాక, అబార్షన్ ప్రక్రియలో మీ గర్భాశయం బలహీనపడే అవకాశం ఉంది. ఈ అవయవం ప్రతికూల ప్రభావం చూపిస్తే.. పిల్లలు పుట్టడం సమస్యగా మారుతుంది.
Also Read: Job Tips: మీరు ఇలా చేస్తున్నారా.. అయితే జాబ్ మారాల్సిందే!
గర్భస్రావం తర్వాత గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి
అబార్షన్ జరిగిన తర్వాత మీ గర్భాశయం ఆరోగ్యంగా తయారు కావడానికి కొంతకాలం పడుతుంది. అబార్షన్ తర్వాత పిల్లలు కావాలనుకుంటే గైనకాలజిస్ట్‌ను సంప్రదించి వారి సలహాలు తీసుకోవాలి. వారి సలహాలు పాటించి పిల్లల కోసం ప్లాన్ చేస్తే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
Also Read: Sapota Benefits: సపోటా తింటున్నారా.. ఈ విషయాలు మీకు తెలుసా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook