Pomegranate Juice Miracles: రోజూ ఉదయం దానిమ్మ జ్యూస్ ఇలా తీసుకుంటే శరీరంలో ఏమౌతుందా తెలుసా
Pomegranate Juice Benefits in Telugu: ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాలు, పండ్లలో మనిషి శరీరానికి అవసరమయ్యే పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఏ పోషకాలు ఎందులో లభిస్తాయో తెలుసుకుని తినగలిగితే చాలు. అలాంటిదే దానిమ్మ. దానిమ్మ ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pomegranate Juice Benefits in Telugu: మార్కెట్‌లో విరివిగా లభించే దానిమ్మలో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లకు కొదవ లేదు. అందుకే దానిమ్మ క్రమం తప్పకుండా తినమని వైద్యులు సూచిస్తుంటారు. శరీరంలో పలు అవయవాల పనితీరు మెరుగుపర్చడం వంటి లాభాలు ఉన్నాయి. రోజూ క్రమం తప్పకుండా దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల మీ శరీరంలో మీరు ఊహించని మార్పులు గమనించవచ్చు.
దానిమ్మ జ్యూస్ రోజూ తాగడం వల్ల ఒకటి కాదు రెండు కాదు లెక్కకు మించిన ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాల కారణంగా రోగ నిరోధక శక్తి పెరిగి సీజనల్ ఇన్‌ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. అన్నింటికీ మించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. స్కిన్ అండ్ హెయిర్ కేర్‌కు అద్బుతంగా పనిచేస్తుంది. రోజూ క్రమం తప్పకుండా దానిమ్మ జ్యూస్ తాగితే చర్మం రంగులో కూడా మార్పు కన్పిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా ఆస్తమా, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
మధుమేహానికి చెక్
దానిమ్మ జ్యూస్ రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల డయాబెటిస్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. దానిమ్మలో లెక్కకు మించి ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె వ్యాధుల సమస్యల్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ప్యూనికాలజిన్ అనే రసాయనం కారణంగా శరీరంలో ఫ్రీ రాడికల్స్ నాశనమౌతాయి. ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ నాశనమౌతాయో వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
స్కిన్ అండ్ హెయిర్ కేర్
దానిమ్మ జ్యూస్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనివల్ల ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతుంది. సీజన్ మారినప్పుడు వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. ఇందులో ఉండే పొటాషియం, ఇతర పోషకాల కారణంగా రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలోని విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది. చర్మంపై ముడతలు పోతాయి. వృద్ధాప్య లక్షణాలు దూరమౌతాయి. జుట్టు రాలే సమస్యకు కూడా ఇది చెక్ పెడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాల కారణంగా జుట్టు బలంగా ఉంటుంది.
గుండె వ్యాధులకు చెక్
దానిమ్మ జ్యూస్ రోజూ క్రమం తప్పకుండా ఉదయం వేళ తాగడం వల్ల ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాల్ని క్లీన్ చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ లబిస్తుంది. ఇందులో ఉండే ఐరన్ , కాల్షియం కారణంగా రక్త హీనత సమస్య తొలగిపోతుంది.
Also read: Diabetes Control Tips: డయాబెటిస్ అదుపులో ఉంచే సులభమైన ఆద్భుతమైన చిట్కాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.