Diabetes Control Tips in Telugu: బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఇది పూర్తిగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వచ్చే సమస్య. ఈ రెండింటినీ స్ట్రీమ్ లైన్ చేస్తే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా డయాబెటిస్ సులభంగా నియంత్రించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
డయాబెటిస్ వ్యాధిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఈ ఒక్క వ్యాధి ఇతర సమస్యలకు కారణం కాగలదు. డయాబెటిస్ నిర్లక్ష్యం చేసినా లేక బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినా కిడ్నీలు, కళ్లు, లివర్ వంటి అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. దీనికోసం అల్లోపతి మందులు వాడేకంటే కొన్ని హోమ్ రెమిడీస్ సహాయంతో నియంత్రించుకుంటేనే అన్ని విధాలా మంచిది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు పూర్తిగా మార్చుకోవాలి. ముఖ్యంగా తినే ఆహారంలో గ్రీన్ వెజిటబుల్స్, సలాడ్స్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఇక పండ్ల విషయంలో కివి, అవకాడో, జామ, బొప్పాయి క్రమం తప్పకుండా తినాలి. వీటివల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
ఇక కూరగాయల్లో కాకరకాయ, మెంతులు తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. ఈ రెండు స్వభావరీత్యా చేదుగా ఉంటాయి. కానీ పోషక విలువలు చాలా ఎక్కువ. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండాలంటే ఈ రెండూ డైట్‌లో ఉండాల్సిందే. డ్రై ఫ్రూట్స్‌లో బాదం, వాల్‌నట్స్ తప్పకుండా ఉండాలి. ఇది కాకుండా రోజూ కనీసం 30-40 నిమిషాలు వాకింగ్ తప్పకుండా చేయాలి.
శారీరక వ్యాయామం లేకపోయినా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుని, జీవనశైలిని మెరుగుపర్చుకుంటే తప్పకుండా డయాబెటిస్ అదుపులో ఉంటుంది. డైట్, లైఫ్‌స్టైల్ రెండూ మార్చుకుంటే తప్పకుండా డయాబెటిస్‌కు చెక్ పెట్టవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.