Post Pregnancy Diet: ప్రసవం అనేది మహిళ శరీరంలో చాలా పెద్ద మార్పు. నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా, శరీరం పూర్తిగా  కొత్త దశలోకి మారుతుంది. ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా ప్రసవం తర్వాత చాలా మంది మహిళల్లో రక్తహీనత సమస్య వస్తుంది. ఐరన్‌, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం. అయితే కొంతమంది బాలింతలకు బెల్లంతో చేసిన పాయసం తప్పకుండా ఇస్తారు.  దీని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని భావిస్తారు. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, సెలీనియం లాంటి మినరళ్లుంటాయి. దీంతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రసవం తర్వాత బెల్లం పాయసం ఎందుకు తినాలి??


ప్రసవం తర్వాత బెల్లం పాయసం తినడం వెనుక చాలా ఆరోగ్యకరమైన కారణాలు ఉన్నాయి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే కాకుండా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో బాలింతలకు ఇచ్చే సాంప్రదాయ ఆహారం. దీని తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం. 


బెల్లం పాయసం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:


ప్రసవం తర్వాత మహిళ శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. బెల్లం అన్నం తినడం వల్ల ఇందులో ఉండే ఐరన్‌, గ్లూకోజ్‌ శరీరానికి శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా బెల్లం పాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది. దీని వల్ల  తల్లి పాలు తాగే శిశువుకు అవసరమైన పోషకాలను అందుతాయి. బెల్లంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రసవం తర్వాత జీర్ణ సంబంధమైన సమస్యలను నివారిస్తుంది.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తల్లి, శిశువు అంటు వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. బెల్లంలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా బెల్లం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రసవం తర్వాత కలిగే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.


బెల్లం పాయసం తయారీ విధానం: 


కావలసిన పదార్థాలు:
సేమ్య
పాలు
బెల్లం


గుప్పి మినుములు
నెయ్యి
యాలకాయ


ద్రాక్ష
కిషమి
బాదం
పిస్తా


తయారీ విధానం:


ఒక పాత్రలో నెయ్యి వేసి వేడి చేయండి. ఆ తర్వాత సేమయాను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఒక పెద్ద పాత్రలో పాలు తీసుకొని మరిగించండి. పాలు మరిగించిన తర్వాత బెల్లం ముక్కలు వేసి కరిగించండి. గుప్పి మినుములను ముందుగా నీటిలో నానబెట్టి ఉంచాలి. వాటిని పాలలో వేసి మరిగించండి. వేయించిన సేమయాను పాలలో వేసి బాగా కలపండి. చిన్న ముక్కలుగా చేసిన బాదం, పిస్తా, ద్రాక్ష, కిషమి వంటి డ్రై ఫ్రూట్స్‌ను వేసి కలపండి. చిటికెడు యాలకాయ పొడి వేసి కలపండి. పాయసం కాస్త గట్టిగా వచ్చే వరకు మరిగించండి.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.