Prostate Cancer Signs: బాడీలోని ఈ 3 భాగాల్లో సమస్య ఉంటే ప్రోస్టేట్ కేన్సర్ కావచ్చు
Prostate Cancer Signs: శరీరంలో అంతర్గతంగా జరిగే పలు మార్పులు వివిధ రకాల వ్యాధులకు సంకేతాలవుతాయి. అందుకే కొన్ని లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదంటారు. ముఖ్యంగా శరీరంలోని దిగువ భాగంలో కన్పించే 3 ప్రధాన లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
Prostate Cancer Signs: వివిద రకాల కేన్సర్ రకాల గురించి తెలుసుకుంటుంటాం. ప్రోస్టేట్ కేన్సర్ అందులో ఒకటి. ఇది కేవలం పురుషుల్లోనే సంభవిస్తుంటుంది. అయితే చాలావరకూ మొదటి దశలోనే ఈ కేన్సర్ గుర్తించవచ్చు. అయితే ముందుగా కన్పించే కొన్ని లక్షణాలను గుర్తించాల్సి ఉటుంది. ఈ మూడు లక్షణాలను పసిగడితే ప్రోస్టేట్ కేన్సర్ ముప్పును నియంత్రించవచ్చు.
పురుషుల్లో ఎక్కువగా వచ్చే కేన్సర్ రకాల్లో ప్రోస్టేట్ కేన్సర్ ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2020లో ఈ కేన్సర్ కారణంగా 10 మిలియన్ల మంది పురుషులు మృత్యువాత పడ్డారంటే ఎంత తీవ్రంగా ఉందో అర్ధఘం చేసుకోవచ్చు. సాధారణంగా 65 ఏళ్లు దాటిన పురుషుల్లో కేన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. కానీ తక్కువ వయస్సు కలిగిన పురుషులకు కూడా ఇటీవలి కాలంలో ప్రోస్టేట్ కేన్సర్ సోకుతున్న సందర్భాలున్నాయి. స్థూలకాయంతో ఉన్నవారు లేదా వంశంలో ఈ వ్యాధిగ్రస్థులున్నా ప్రోస్టేట్ కేన్సర్ ముప్పు పొంచి ఉంటుందని అంచనా వేయవచ్చు. అయితే త్వరగా గుర్తించగలిగితే ఈ కేన్సర్‌కు చికిత్స సాధ్యమేనంటున్నారు వైద్యులు.
ప్రోస్టేట్ కేన్సర్‌లో మూడు ప్రధాన లక్షణాలు
శరీరంలోని మూడు ప్రధాన భాగాల్లో నొప్పిగా ఉంటే నిర్లక్ష్యం వహించకూడదు. తుంటి, పెల్విస్, నడుము భాగంలో నొప్పి ఉంటే జాగ్రత్త పడాలి. నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. ప్రోస్టేట్ కేన్సర్ లక్షణం కావచ్చు. ఇంకా ఇతర లక్షణాల్లో మూత విసర్జనలో ఇబ్బంది, మూత్రం తక్కువగా రావడం, మూత్రంలో రక్తం, స్పెర్మ్ లో రక్తం, ఎముకల్లో నొప్పి, ఆకశ్మికంగా బరువు తగ్గడం, ఇన్‌ఫెర్టిలిటీ వంటివి ఉన్నాయి.
ప్రోస్టేట్ కేన్సర్ ఎందుకు ప్రమాదకరమైందంటే ఇతర భాగాలకు సులభంగా వ్యాపిస్తుంది. అంటే సకాలంలో దీనికి చికిత్స చేయించుకోకుంటే ఎముకలు, ప్రేవులు, లివర్, ఊపిరితిత్తుల వరకూ వ్యాపించవచ్చు. ప్రోస్టేట్ కేన్సర్ నుంచి రక్షించుకోవాలంటే ఉత్తమ విధానం హెల్త్ స్టైల్ మార్చుకోవడం. హెల్త్ స్టైల్ బాగుంటే చాలావరకూ ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం, తగిన వ్యాయామం చేయడం ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవడం చేస్తుండాలి.
Also read: Monsoon Skin Care: వర్షాకాలంలో మీ చర్మం జడ్డుగా మారుతోందా, ఈ టిప్స్ ట్రై చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook