Pulse Oximeter.. కరోనా తొలి దశలో అక్కడక్కడ మాత్రమే వినిపించిన పల్స్‌ ఆక్సీమీటర్‌ పేరు కరోనా సెకండ్ వేవ్‌లో దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ప్రపంచ దేశాలు సైతం పల్స్ ఆక్సీమీటర్‌ను వినియోగించి ప్రమాదాన్ని ముందే పసిగడుతున్నారు. గతంలో కేవలం ఆసుపత్రులలో వైద్యులు ఉపయోగించే పల్స్ ఆక్సీమీటర్ వినియోగం నేడు పెరిగింది. కరోనా కేసులు పెరగడంతో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ లాంటివి ఈ పరికరాన్ని వాడేలా చేస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్19 బారిన పడిన వారిలో శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గడాన్ని తొలి రోజుల్లోనే గుర్తించకపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా సోకిన తొలి రోజుల్లో హైపోఆక్సిమీయా సమస్య తలెత్తుతుంది. అంటే రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గడం అని అర్థం. ఆరోగ్యంగా ఉన్నవారిలో 94శాతం కన్నా అధికంగా ఉంటుంది. అయితే రక్తంలో ఆక్సిజన్ స్థాయి 92శాతం కన్నా తక్కువగా ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. వెంటనే దగ్లర్లోని వైద్యుడ్ని సంప్రదించడం ద్వారా వెంటనే చికిత్స ప్రారంభిస్తారు. COVID-19 పేషెంట్స్ పల్స్ ఆక్సీమీటర్‌ను ఎలా ఉపయోగించాలన్నదానిపై కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు చేసింది. ఆ వివరాలు మీకోసం


Also Read: COVID-19 Vaccines: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 50 శాతం డోసులు ఫ్రీ


పల్స్‌ ఆక్సీమీటర్‌ను ఉపయోగించే విధానం..


 -  మీ చేతివేలి గోళ్లకు ఏదైనా నెయిల్‌ పాలిష్‌ ఉన్నట్లయితే దాన్ని పూర్తిగా తొలగించాలి. చేతులు చల్లగా ఉంటే వెచ్చదనం కోసం రెండు చేతులను రుద్దాలి.


 -  కనీసం 5 నిమిషాల పాటు ఏ ఆలోచన లేకుండా విశ్రాంతి తీసుకోవాలి.


-  ఆ తరువాత మీ చేతిని ఛాతిమీద గుండెకు దగ్గర్లో ఉంచాలి. 


 -  పల్స్ ఆక్సీమీటర్‌(Pulse Oximeter) స్విచ్ ఆన్ చేసి మీ చేతి మధ్యవేలు లేదా చూపుడు వేలుకు ఉంచాలి.


 -  ఆక్సీమీటర్ రీడింగ్ కొద్దిసేపు మారుతుంది. ఒక్కసారి రీడింగ్ స్థిరంగా చూపించే వరకు ఎదురుచూడాలి. కనీసం ఒక నిమిషం పాటు ఆక్సీమీటర్‌ను చేతి వేలికి అలాగే ఉంచాలి. 


 -  రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలో కనీసం 5 సెకన్ల పాటు రీడింగ్‌లో మార్పు లేకపోతే దాన్ని అత్యధిక స్థాయి సంఖ్యగా నమోదు చేసుకోవాలి.


 -  పల్స్ ఆక్సీమీటర్‌లో ఆక్సిజన్‌ స్థాయిలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.


 -  మొదటి రోజు ఆక్సిజన్‌ స్థాయిలను పరిశీలించి రీడింగ్ నమోదు చేసుకోవాలి, ఒకే సమయంలో మూడు సార్లు ఆక్సిజన్ శాతం రీడింగ్ ఎంత ఉందో రికార్డు చేయాలి.


Also Read: COVID-19 Oxygen Levels: ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకునేందుకు ఈ చిట్కా పాటించండి, బీ అలర్ట్


ప్రతి 6 గంటలకు ఆక్సిజన్ లెవెల్స్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే 94 శాతానికి మాత్రం తగ్గకూడదు. అంతకుమించి 92 అంతకన్నా తక్కువ రీడింగ్ నమోదైతే కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలని. తొలి దశలో ఆక్సిజన్ స్థాయిని పెంచుకునేందుకు ఉదర భాగంపై పడుకుని గట్టిగా శ్వాస తీసుకోవాలి. Prone Positionలో పడుకుని శ్వాస తీసుకోవడం ద్వారా రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని, కొన్ని రకాల శ్వాసకోశ సమస్యలకు ఈ టెక్నిక్ ఉపయోగిస్తారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook