Pulses For In High Cholesterol: కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏ పప్పులు తినాలి..?
Pulses For In High Cholesterol: పప్పులు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. పప్పులో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్న వారు ఖచ్చితంగా పప్పులను వినియోగించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Pulses For In High Cholesterol: పప్పులు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. పప్పులో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్న వారు ఖచ్చితంగా పప్పులను వినియోగించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే వైద్య శాస్త్రం కొలెస్ట్రాల్‌ను రెండు రకాలుగా విభజించింది. ఒకటి మంచి కొలెస్ట్రాల్, రెండోది చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో పప్పుధాన్యాలు గణనీయంగా దోహదం చేస్తాయని.. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచేందుకు తోడ్పడతాయని వైద్యులు తెలిపారు.
మూంగ్ లెంటిల్ పప్పు(Moong Lentil Dhal):
మూంగ్ లెంటిల్ పప్పుతో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చని చాలా నివేదికలు వెల్లడించాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు గుండెపోటు ప్రమాదం పెరుగుతుందని అందరికీ తెలుసు. ఈ పప్పును తీసుకోవడం ద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
మూంగ్ పప్పు ఇతర ప్రయోజనాలు:
ఉదర సమస్య ఉన్న వారు కూడా ఈ పప్పును తీసుకోవచ్చు. పప్పులో అనేక రకాల ప్రోటీన్స్ ఉండడం వల్ల జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుంది. అంతే కాకుండా బరువును నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది. అయితే ఈ పప్పును వారానికి మూడుసార్లు తినవచ్చొని వైద్య నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: CSK vs DC: ఓల్డ్ మ్యాన్ బాగా ఆపావు.. చెన్నై స్టార్ ఆటగాడిని ట్రోల్ చేసిన ఎంఎస్ ధోనీ!
Also Read: Viral Video: ఆ పిల్లాడు చేసిన చిలిపికి స్వీపర్ వణికిపోయాడు..నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook