Health Tips: బీటా కెరొటిన్‌కు పవర్‌హౌజ్.. ఈ ఆరెంజ్ రంగు కాయతో ఎన్నో బెనిఫిట్స్..
Pumpkin Health Beefits: ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు కచ్చితంగా మన డైట్‌లో ఉండాల్సిందే. అందుకే ఆరోగ్య నిపుణులు కూరగాయలు, పండ్లు ఆహరంలో చేర్చుకోవాలి అంటారు. వీటిలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, ఏ విటమిన్స్ మన శరీరంలో తగ్గినా ఆరోగ్య సమస్యలు తీసుకు వస్తాయి. మన శరీరంలో బీటా కెరొటిన్ తగ్గకుండా ఉండాలి అంటే కొన్ని రకాల ఆహారాలు డైట్‌లో చేర్చుకోవాలి.
Pumpkin Health Beefits: గుమ్మడికాయ ఈ పసుపు రంగులో ఉండే కాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీంతో బరువు పెరగకుండా కూడా ఉంటారు. గుమ్మడికాయతో సాంబర్, హల్వా, వడియాలు తయారు చేసుకుంటారు. రుచి అద్భుతంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.
గుమ్మడికాయలో పొటాషియం, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా సహాయపడుతుంది. అంతేకాదు గుమ్మడి కాయలో విటమిన్ సీ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ స్థాయులను కూడా పెంచుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీంతో స్కిన్ ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపిస్తుంది.
గుమ్మడి కాయను డైట్‌లో చేర్చుకుంటే పేగు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కడుపు నిండిన అనుభూతి కూడా ఎక్కువ సమయంపాటు అనిపిస్తుంది. దీంతో బరువు కూడా పెరగకుండా ఉంటారు. ఇందులో బీటా కెరొటిన్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇందులో పరవ్ ఫుట్ యాంటి ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మన శరీరంలోకి వెళ్లిన తర్వాత విటమిన్ 'ఏ' గా మారుతుంది.
గుమ్మడికాయలో కేన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడే కెరొటెనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. గుమ్మడికాయలోనే కాదు, గుమ్మడి గింజల్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. గుమ్మడి గింజలను వేయించి తీసుకోవచ్చు. మార్కెట్‌లో కూడా సులభంగా అందుబాటులో ఉంటాయి. వీటిని సలాడ్స్ పై డ్రెస్సింగ్ రూపంలో కూడా తీసుకుంటారు.
ఇదీ చదవండి: Hair Fall: కేవలం ఈ 2 చాలు.. జుట్టు అస్సలు పట్టుకుని లాగినా ఊడదు..!
గుమ్మడికాయను డైట్‌లో చేర్చుకోవడం వల్ల కంటిచూపు కూడా మెరుగుపడుతుంది. ఇందులో బీటా కెరొటిన్ విటమిన్ ఏ లా మారుతుంది. దీంతో మీ కంటి చూపు వృద్ధాప్యంలో కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇందులో లుటీన్,జియాంథిన్ ఉంటుంది. అంతేకాదు ఎముకల ఆరోగ్యానికి కూడా గుమ్మడి కాయ మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండేది విటమిన్ కే. ఇది క్యాల్షియం స్థాయిలను నిర్వహిస్తుంది. ఇందులో జింక్ కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఫెర్టిలిటీ సమస్యతో బాధపడేవారికి మేలు చేస్తుంది. స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. గుమ్మడికాయను వేయించి తీసుకోవచ్చు. గింజలను కూడా ఫ్రై చేసి మీ డైట్‌లో చేర్చుకోవచ్చు.
ఇదీ చదవండి: America Elections 2024: అమెరికా ఎన్నికలు నవంబర్ మొదటి మంగళవారమే ఎందుకు నిర్వహిస్తారు? అసలు కారణం ఇదే..
జీర్ణ సమస్యలతో బాధపడేవారు గుమ్మడి కాయను డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా ఇవి నియంత్రిస్తాయి.దీంతో బరువు కూడా పెరగకుండా ఉంటారు. గుమ్మడికాయ తొక్కలో కూడా పాలీశాచురైడ్స్ ఉంటాయి. ఇవి కడుపులో మంచి బ్యాక్టిరియా పెరగడానికి సహాయపడతాయి. గుమ్మడి కాయను ఇలా మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రాణాంతక కేన్సర్ కణాలు పెరగకుండా గుమ్మడి కాయ వ్యతిరేకంగా పోరాడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.