Pumpkin Juice For Weight Loss: గుమ్మడికాయ చాలా మంది వంటకాల్లో వినియోగిస్తారు. ఇందులో శరీరానికి మేలు చేసే చాలా రకాల గుణాలున్నాయి. కావున వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో గుమ్మడి కాయతో చేసిన స్వీట్‌ కూడా లభించడం విశేషం. గుమ్మడిని తరచుగా వినియోగించడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో విటమిన్లు, ఫైబర్, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు ఉండడం వల్ల శరీర బరువును సులభంగా నియంత్రిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా వీటిలో ఉండే మూలకాలు జీర్ణక్రియను కూడా మెరుగు పరుచి.. వివిధ రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో విటమిన్ డి తగినంత మెతాదులో ఉంటుంది. కావున శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే గుమ్మడికాయ రసంలో కూడా చాలా రకాల పోషకాలుంటాయి. వీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల బరువు ఎలా నియంత్రణలో ఉంటుందో తెలుసుకుందాం..


బరువు తగ్గడానికి గుమ్మడికాయ రసం ఎలా ఉపయోగపడుతుంది:


గుమ్మడికాయ రసంలో శరీరానికి మేలు చేసే కాల్షియం, పొటాషియం, విటమిన్లు ఎ, ఇ, సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది జీర్ణ క్రియను మెరుగుపరచడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. కావును శరీర బరువు కూడా అదుపులో ఉంచుతుంది. దీని కోసం రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గుమ్మడికాయ రసం తాగడం వల్ల త్వరలోనే బరువు తగ్గడం వంటి మార్పులు మీరు చూడొచ్చు.



ఈ సమస్యలన్నీ దూరమవుతాయి:


>>గుమ్మడికాయ రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ దృఢంగా మారుతుంది.
>>మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.
>>గుమ్మడికాయ రసం యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. కావున శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడానికి సహాయపడతాయి.
>>వాపును తగ్గించడానికి ప్రభావవంతంగా కృషి చేస్తుంది.
>>గుమ్మడికాయ రసంలో బరువును అదుపు ఉంచే మూలకాలున్నాయి.
>>మధుమేహ వ్యాధిగ్రస్తులు బరువు తగ్గడానికి తప్పనిసరిగా గుమ్మడికాయ రసం తీసుకోవాలి.


Also Read: Palnadu: పల్నాడు జిల్లాలో పరువు హత్య కలకలం..కొడుకును చంపిన తల్లిదండ్రులు..!


Also Read: August Bank Holidays: ఖాతాదారులకు హెచ్చరిక.. ఆగ‌స్టులో ఏకంగా 18 రోజులు బ్యాంకులకు సెలవులు 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook