Pumpkin Seeds Benefits: గుప్పెడు గింజలతో బోలెడు లాభాలు..కొలెస్ట్రాల్ సైతం వెన్నల కరిగి రావాల్సిందే..
Pumpkin Seeds Bad For Cholesterol: ప్రతిరోజు గుమ్మడి గింజలను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రభావంతంగా సహాయపడతాయి. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా గుమ్మడి గింజలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
Pumpkin Seeds Bad For Cholesterol: మన భారతీయులు ఎన్నో రకాల గింజలను ఆహారంగా తీసుకుంటారు. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా.. ఎన్నో రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. తరచుగా మనం కొన్ని రకాల పండ్ల నుంచి తీసిన గింజలను వినియోగిస్తూ ఉంటాము. ఈ గింజల్లో గుమ్మడి గింజలు ఒకటి..వీటిలో శరీరాన్ని కావాల్సిన బోలెడు పోషకాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ గింజలను ప్రతిరోజు ఎలా తీసుకోవాలో? గుమ్మడి గింజల వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో? మనం ఇప్పుడు తెలుసుకుందాం..
గుమ్మడి గింజలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీనివల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలను ప్రతిరోజూ తినే వారిలో కండరాలు పెరగడమే, కాకుండా శరీరం దృఢంగా మారిందని వారు అంటున్నారు. తరచుగా కండరాల తిమ్మిర్లతో బాధపడేవారు ఈ గింజలను ఆహారాల్లో వినియోగించడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
ఈ గింజలను అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల హార్మోన్ల సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు స్త్రీలకు సంబంధించిన సమస్యలను సులభంగా తగ్గించేందుకు కీలకపాత్ర పోషిస్తాయి. తరచుగా గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల కంటిచూపు సమస్యలు కూడా దూరమవుతాయి. ఇందులో లభించే విటమిన్ ఇ, బీటా కెరోటీన్ మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి తరచుగా కంటిచూపు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఆహారంలో గుమ్మడి గింజలను తీసుకోవాల్సి ఉంటుంది.
వాతావరణంలో కాలుష్యం పెరగడం కారణంగా జుట్టు సమస్యలతో పాటు చర్మ సమస్యలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా గుమ్మడి గింజలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజల్లో లభించే ఆయుర్వేద గుణాలు కిడ్నీలో రాళ్ల సమస్యలను కూడా సులభంగా తగ్గిస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ గింజలు ఎంతో సహాయపడతాయి.
శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారు కూడా గుమ్మడి గింజలను తినవచ్చని ఆయుర్వేద ని గుణాలు చెబుతున్నారు. ఇందులో లభించే ఫైబర్ గుణాలు శరీరంలోని పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను సులభంగా కలిగిస్తాయి. దీంతోపాటు గుండెపోటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కూడా సహాయపడతాయి. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు డైట్ పద్ధతిలో ఆహారాలు తీసుకునే క్రమంలో తప్పకుండా గుమ్మడి గింజలను కూడా అందులో చేర్చుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి