Purple Cabbage Benefits: రక్తపోటు, గుండె జబ్బులకు చెక్ పెట్టే పర్పుల్ క్యాబేజీ.. తినండి ఇలా..
Purple Cabbage For Blood Pressure And Heart Disease: పర్పుల్ క్యాబేజీని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా బరువు కూడా తగ్గుతారు.
Purple Cabbage For Blood Pressure And Heart Disease: ప్రస్తుతం చాలా మంది క్యాబేజీని తినేందుకు ఇష్టపడడం లేదు. ముఖ్యంగా పిల్లలైతే దీని వాసన కూడా చూడడం లేదు. నిజానికి క్యాబేజీని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే చాలా మంది ఆకు పచ్చని రంగులో ఉండే క్యాబేజీని చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా పర్పుల్ క్యాబేజీని చూశారా? నిజానికి ఆకు పచ్చని క్యాబేజీ కంటే పర్పుల్ క్యాబేజీలో శరీరానికి కావాల్సిన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ క్యాబేజీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే శరీరానికి ఈ పర్పుల్ క్యాబేజీ వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పర్పుల్ క్యాబేజీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్యల సమస్య నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్ గుణాలు సులభంగా గుండె సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. తరచుగా రక్తపోటు సమస్యలతో బాధపడేవారు అనారోగ్య సమస్యల బారిన పడితే తప్పకుండా ఆహారంలో పర్పుల్ క్యాబేజీని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ సి కూడా లభిస్తుంది. కాబట్టి కంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో లభించే, విటమిన్ కె, కాల్షియం, మాంగనీస్, జింక్ ఎముకలను దృఢంగా తయారు చేసేందుకు కూడా సహాయపడతాయి. దీంతో పాటు ఎముకల ఆరోగ్యాన్ని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
పర్పుల్ క్యాబేజీని క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇందులో లభించే ఫైబర్ సులభంగా శరీర బరువు నియంత్రిస్తుంది. దీంతో పాటు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. అయితే సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు సలాడ్‌లో తప్పకుండా ఈ పర్పుల్ క్యాబేజీని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇందులో ఉండే మూలకాలు స్ట్రోక్ రాకుండా కూడా గుండెను రక్షిస్తుంది.
పర్పుల్ క్యాబేజీలలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి శరీరంలోని అదనపు ఈస్ట్రోజెన్‌ను బయటకు పంపడానికి ఎంతగానో సహాయపడుతుంది. దీని కారణంగా మహిళల్లో అనోవిలేషన్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో లభించే కొన్ని మూలకాలు వాపును తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే పర్పుల్ క్యాబేజీ యాంటీఆక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో లభిస్తాయి. దీని కారణంగా సులభంగా రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి