ఆ `పాట`కి వ్యాయామం చేయాల్సిందే !
వన్, టు, త్రి, ఫోర్ ... ఇది వినగానే మనం వ్యాయామానికి సిద్దమైతామో?లేదో? కానీ ఇచి,ని, సాన్.. అంటే జపనీయులు వ్యాయామానికి రెడీ ఆవుతారు. ఇచి,ని, సాన్.. అంటే జపనీభాషలో ఒకటి, రెండు మూడు.. అని అర్థం. ఇది అక్కడి వ్యాయామగీతం అన్నమాట. ఈ పాటలో ఒకటి, రెండు, మూడు తప్ప ఇంకేదీ ఉండదు. అలానే చివరి వరకు పాడుతారు.
ఈ సాంప్రదాయం జపాన్ లో ఇప్పటిది కాదు.. వందేళ్లనాటిది. అప్పటినుంచీ ప్రతి స్కూల్ లో ఇది పిల్లలకు డ్రిల్ అయిపొయింది. ఆ పాట రాగానే వ్యాయామం చేయటానికి నిల్చుంటారు. అందుకే దీని గురించి అక్కడ అందరికీ తెలుసు. ఈ పాటను జాతీయ రేడియో 'ఎన్హెచ్కే' లో ప్రతిరోజూ ఉదయం ప్రసారం చేస్తారు. అందుకే అక్కడ దీనిని 'రేజియో టైసో (రేడియో వ్యాయామం)' అని పిలుస్తారు. ఆ పాటలో వన్, టూ, త్రీ.. కు తగట్టు మనమాదిరే చేతులు కాళ్ళు కదల్చడం, నడుము తిప్పడం, శరీరాన్ని ముందుకూ వెనక్కీ వంచడం.. లాంటివి ఉంటాయి.
అక్కడ ఆఫీసుల్లో కూడా ఉద్యోగులు రోజూ ఈ వ్యాయామం చేస్తారట. ఇది మానసిక ఒత్తిడిని జయిస్తుందని జపనీయులు నమ్మకం. మొదట్లో ఈ పాట 10 నిమిషాలు ఉండేది.. కానీ దీనిని ఇప్పుడు మూడు నిమిషాలకు కుదించారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ముందుకొచ్చి మరీ.. తమ ఉద్యోగులను ఆరోగ్యంగా ఉంచడానికి మధ్యాహ్నం పూట కూడా ఈ పాటను వేసి వ్యాయామం చేయిస్తుంది. ఒకే దేశంలో.. ఒకే తరహా వ్యాయామం.. ఒకే విధంగా చేయటం గొప్ప విషయమే. మనదేశంలో కూడా ఇలా అమలు చేస్తే బాగుంటుంది కదా !!