COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ragi Soup For Bad Cholesterol: రోజంతా శక్తివంతంగా ఉండడానికి ప్రతిరోజు ఉదయం పూట అల్పాహారంలో భాగంగా తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది యువత కొలెస్ట్రాల్ అధిక మోతాదులో లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. దీని కారణంగా అతి చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తక్కువ వయసులోనే గుండెపోటు రావడానికి కూడా ఈ అనారోగ్య కారమైన ఆహారాలు ఒక కారణమని వారంటున్నారు. అయితే ఇలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి, ఎక్కువ కాలం జీవించడానికి తప్పకుండా ఉదయం పూట అల్పాహారంలో భాగంగా కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా రాగుల పిండితో తయారు చేసిన సూప్‌ని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 


రాగుల పిండితో తయారు చేసిన సూప్ లేదా రోటీలను ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో లభించే ఔషధ గుణాలు శరీరాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా రక్షించేందుకు తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్, మధుమేహంతో బాధపడుతున్న వారు ప్రతిరోజు రాగిజావను తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అంతేకాకుండా రోజంతా ఎంతో యాక్టివ్‌గా పని చేస్తారు.


శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాల పెరిగి అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఉదయం పూట టిఫిన్ కి బదులుగా రాగిజావను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ జావాలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను సులభంగా కరిగించి గుండె సమస్యల బారిన పడకుండా కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పూట రాగి జావ లేదా రోటీలను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు


రాగి సూప్ తయారీ పద్ధతి:
రాగి సూప్ తయారు చేయడానికి ముందుగా ఓ బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది అందులో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ పై మరో బౌల్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఆ వెజిటేబుల్స్ అన్నిటిని అందులో వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక కప్పు రాగిజావకు నాలుగు వంతు నీటిని తీసుకొని వేయించుకున్న బౌల్లో నీటిని పోసుకోవాలి. ఆ తర్వాత అందులోనే తగినంత ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత ఒక కప్పు రాగి పిండిని వేసుకొని సూప్‌లా తయారు చేసుకోవాలి.  అంతే సులభంగా రాగి సూప్ తయారైనట్లే..


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter