Weight Loss Diet: 15 రోజుల్లో రెడ్ రైస్‌తో బరువు తగ్గడమే కాకుండా మధుమేహానికి చెక్!
Red Rice For Weight Loss: ప్రస్తుతం చాలా మంది వైట్ రైస్‌ను అతిగా తీసుకుంటున్నారు. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. వీటికి బదులుగా రెడ్ రైస్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
Red Rice For Weight Loss: ప్రపంచవ్యాప్తంగా వైట్ రైస్‌ను భారత దేశంలో ఎక్కువగా ఆహారంగా వినియోగిస్తారు. ఫ్రైడ్ రైస్, బిర్యానీ, ఇడ్లీ, దోస వంటి ఆహార పదార్థాలు తయారు చేయడానికి తరచుగా వినియోగిస్తారు. అయితే మధుమేహం ఉన్నవారు వీటిని అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటికి బదులుగా ఆరోగ్య నిపుణులు సూచించిన రెడ్ రైస్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు రెడ్ రైస్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్ రైస్ తినడం వల్ల కలిగే లాభాలు:
శరీర బరువు తగ్గుతారు:
బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు వైట్‌రైస్‌కు బదులుగా రెడ్ రైస్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Also read: Hair Mask: డేండ్రఫ్ సమస్యను సమూలంగా తొలగించే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదే
ఎముకలను దృఢంగా చేస్తుంది:
రెడ్ రైస్‌లో అధిక పరిమాణంలో మెగ్నీషియం ఉంటుంది. ఈ రైస్‌ను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు తగ్గి, ఎముకలు దృఢంగా మారుతాయి. అంతేకాకుండా శరీరంలోని నొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
క్యాన్సర్ నివారిస్తుంది:
రెడ్ రైస్‌లో అధిక పరిమాణంలో యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ రైస్‌ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
డయాబెటిస్‌తో బాధపడుతున్నారా?:
మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజు వైట్ రైస్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వీటికి బదులుగా రెడ్ రైస్‌ను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Hair Mask: డేండ్రఫ్ సమస్యను సమూలంగా తొలగించే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook