Reduce Bad Cholesterol: బాడీలో కొలెస్ట్రాల్ పిండి పిప్పి చేయడానికి మీ వంటింట్లో దొరికే ఈ పోపు దినుసులు చాలు..
Quickest Way To Reduce Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ కారణంగా అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొలెస్ట్రాల్ ఉన్నవారు ఉపశమనం పొందితే అంత మంచిది అయితే దీనికోసం ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను వినియోగిస్తే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.
Quickest Way To Reduce Bad Cholesterol: కొలెస్ట్రాల్ పెరగడం అనేది పెద్ద సమస్య కాకపోయినా అది మీ భవిష్యత్తు ఆరోగ్యం పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుగానే చెడు కొలెస్ట్రాల్ లక్షణాలు గమనించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ సమస్య నుంచి బయట పడితే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామందిలో చెడు కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులతో పాటు అధిక రక్తపోటు మధుమేహం వంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎలాంటి ఖర్చులు లేకుండా చెడు కొలెస్ట్రాల్ ను ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలను వినియోగించి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వంటింట్లో లభించే మసాలా దినుసులను ఉపయోగించి కూడా దీని నుంచి విముక్తి పొందవచు. ముఖ్యంగా మనం రోజు ఆహారాల్లో వినియోగించే దాల్చిన చెక్క కూడా కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ చెక్కలో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనితో తయారుచేసిన ఆహారాలు, టీలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.
అలాగే మెంతి గింజలను వినియోగించి కూడా మీ శరీరంలోని కొలెస్ట్రాల్ ను కరిగించుకోవచ్చు. దీనికోసం ప్రతిరోజు ఉదయాన్నే మెంతి గింజలతో తయారు చేసిన టీ ని తాగాల్సి ఉంటుంది ఇందులో ఉండే యాంటీ కొలెస్ట్రాల్ గుణాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగిస్తుంది దీంతోపాటు మెంతి ఆకులతో తయారుచేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. ఎందుకంటే ఈ ఆకుల్లో అధికమవుతాదిలో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర బరువును కూడా నియంత్రించుకోవచ్చు.
దీంతోపాటు ప్రతిరోజు ఉదయాన్నే పాలలో పసుపు కలుపుకొని తాగడం వల్ల కూడా చెడు కొవ్వు కరిగిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు కొవ్వులో ఉండే ఔషధ గుణాలు చెడు కొవ్వును కరిగించి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని వారు అంటున్నారు. దీంతోపాటు వెల్లుల్లిని వినియోగించి కూడా శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. వెల్లుల్లిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter