Reduce Belly Fat: బెల్లీ ఫ్యాట్ సమస్యకు చెక్ పెట్టండి ఇలా!
Fruits For Belly Fat: ఆధునికకాలంలో చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారు.ఈ సమస్య నుంచి బయట పడడానికి జిమ్‌ల చట్టు తిరుగుతారు. కానీ ఎలాంటి లాభం కనిపించదు. బెల్లీ ఫ్యాట్ కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు.అయితే ఇక్కడ చెప్పిన టిప్స్‌ను పాటించడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చు. ఈ టిప్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Fruits For Belly Fat: బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నవారు కొన్ని రకాల పండ్లులు తీసుకోవడం వల్ల సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పండ్లులో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ దాగి ఉంటాయి. దీని వల్ల పొట్టమే ఉన్న కొవ్వును సులభంగా తగ్గించడంలో సహయపడుతాయి. అయితే ఎలాంటి పండ్లను తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది దానిపై మనం ఇప్పుడు తెలుసుకుందాం..
✯ యాపిల్: యాపిల్ పండులో అధిక ఫైబర్, ఫ్లేవనాయిడ్‌లు వంటి గుణాలు ఉంటాయి. ఈ గుణాలు పొట్టపై ఉన్న కొవ్వును కరిగించడంలో ఎంతో సహయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
✯ అరటి పండు: అరటి పండు తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఇందులోని ఫైబర్ కొవ్వును కరిగిస్తుంది. అంతేకాకుండా మలబద్దం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ పండు తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
✯ బ్లూబెర్రీస్: బ్లూబెర్రీస్ బెల్లి ఫ్యాట్‌ను తగ్గిచడంలో ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ బెర్రీస్‌లో నీరు అధికంగా ఉంటుంది. దీనివల్ల ఫ్యాట్ తగ్గుతుంది.
✯ స్ట్రాబెర్రీస్: చాలా మంది స్ట్రాబెర్రీస్ అంటే ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇందులో అధికశాతం విటమిన్లు, వివిధ పోషకాలు లభిస్తాయి. దీని మీ డైట్‌లో భాగంగా తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also read: Uric Acid: యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే వ్యాధులు..ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చిట్కాలు!
✯ నిమ్మకాయలు: నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి బరువు తగ్గిచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగ్గడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చు.
✯ కీరదోస మొక్కలు: కీరదోసకాయలో అధికశాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది. దీని తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
✯ అవకాడో: అవకాడో తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా షుగర్ లెవల్స్‌ను తగ్గి కొవ్వు చేరకుండా చేస్తుంది.
✯ కివి పండు: కివి పండులో ఆక్టినిడైన్ ఎంజైమ్ ఉంటుంది.దీని వల్ల జీర్ణవ్యవస్థ,బెల్లీ ప్యాట్‌ను తగ్గిచడంలో సహాయపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter