Uric Acid: యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని జీర్ణం చేసిన తర్వాత శరీరం నుంచి విడుదలయ్యే సహజ వ్యర్థ పదార్థం. ఇది శరీరంలో నత్రజని అణువులతో తయారైన రసాయన సమ్మేళనాలు విచ్చన్నమవుతాయి. ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకునే వారిలో చాలావరకు జీర్ణక్రియ సమస్యలు రావడమే కాకుండా.. యూరిక్ యాసిడ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటాయి. దీని కారణంగా కొంతమందిలో కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కిడ్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మరికొంతమందిలో దీని కారణంగా కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చాలామంది రక్తంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు మూత్రపిండాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కొంతమందిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం, దీని కారణంగా తీవ్ర నొప్పులు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో యూరిక్ యాసిడ్ నుంచి ఉపశమనం కలిగించే డ్రింక్స్ తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తప్పకుండా తీసుకోవాల్సిన డ్రింక్స్ ఇవే:
✾ క్యారెట్, దోసకాయతో తయారు చేసిన జ్యూస్‌లను ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా యూరిక్ యాసిడ్ సమస్య నుంచి సులభంగా ఉపశమనం లభించి శరీరం డిటాక్సిఫై అవుతుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధపదార్థాలు కూడా సులభంగా బయటికి వస్తాయి దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
✾ యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికి గ్రీన్ టీ కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడమే కాకుండా.. దీని కారణంగా వచ్చే కీళ్ల నొప్పులు కిడ్నీలో రాళ్ల సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి యూరికి ఆసిడ్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా గ్రీన్ టీని ప్రతిరోజు రెండు పూటలా తాగాల్సి ఉంటుంది.
✾ అధిక యూరికి యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. లెమన్ వాటర్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేందుకు ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలోని అదనపు కొవ్వును కూడా సులభంగా నియంత్రిస్తుంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter