Reduce Your Body weight: శరీర బరువు తగ్గించే గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్..
శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా.. ?? అయితే గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్ మీకు తప్పక సహాయ పడుతుంది. నమ్మట్లేదా..? అయితే కింద తెలిపిన పరిశోధనలను చూడండి.
Weight Loss Tips Green Coffee Beanss: కాఫీ సంబంధిత ద్రావణాల వలన ఆరోగ్యానికి ప్రయోజనాలతో పాటూ, దీనిలో ఉండే నికోటిన్, కాఫీకి బానిస చేస్తుందని కొంత భయాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికి, గ్రీన్ కాఫీ విత్తనాలు సారం శరీర బరువు తగ్గిస్తాయి. అవును, నిజమే! గ్రీన్ కాఫీ విత్తనాలు సారాలలో, క్లోరోజేనిక్ ఆసిడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం, శరీరంలో జీవక్రియను ప్రభావితపరచి, బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ప్రస్తుతం చాలా మంది శరీర బరువు తగ్గుంచుకునేందుకు గ్రీన్ కాఫీ విత్తనాలను చాలా మంది వాడుతున్నారు ఈ వ్యాఖ్యను నిజం చేసే కొన్ని పరిశోధనలు వాటి ఫలితాలు గురించి కింద చర్చించబడింది.
పరిశోధనలు
చాలా సంస్థలు దీనిపై పరిశోధనలు జరిపి, క్లోరోజెనిక్ ఆసిడ్ లు జీవక్రియ & శరీర బరువులపై ప్రభావాన్ని చూపిస్తాయని సానుకూల ఫలితాలను వెల్లడించాయి. ఇవి మాత్రమే కాకుండా, గ్రీన్ టీ విత్తనాల సారం ద్వారా శరీర బరువు తగ్గించుకోవచ్చని ప్రముఖ పరిశోధన సంస్థ అయినట్టి "జర్నల్స్ డయాబెటిస్ మెటబోలిక్ సిండ్రోం అండ్ ఒబేసిటీ టార్గెటెడ్ అండ్ థెరపీ" వారు 2012 సంవత్సరంలో ప్రచురించారు.
ఈ పరిశోధనలలో పాల్గొనే వారు, రెండు వారాల పాటూ, అధిక డోస్ గల గ్రీన్ కాఫీ బీన్స్ సారం ఉపభాగాలను తీసుకున్నారు. తరువాత రెండు వారాల పాటూ అల్ప డోస్ గల గ్రీన్ కాఫీ బీన్స్ సారం ఉపభాగాలను మరియు రెండు వారాల పాటూ ప్లసిబో లను తీసుకున్నారు. ఈ రెండు వారాలకి ఇచ్చే డోస్ మధ్యకాలంలో, వారికి ఏ ఇతర ఉపభాగాలను ఇవ్వలేదు. ఈ పరిశోధనల ఫలితంగా, ఈ సంస్థ "గ్రీన్ టీ సీడ్స్ సారం ఇచ్సిన కాలం పాటూ, శరీర బరువు, శరీరంలోని కొవ్వు పదార్థాలు మరియు గుండె రేటు కూడా తగ్గిపోయింది" అని తెలిపారు. పరిశోధనలలో పాల్గొన్న వారు వ్యాయామాలను అనుసరించినపుడు ఎలాంటి బరువు నష్టం జరగలేదని, గ్రీన్ టీ సీడ్స్ సారం తీసుకున్న సమయంలో మాత్రమే వారి శరీర బరువులో వ్యత్యాసాలు కనిపించాయని తెలిపారు.
దీనికి గల కారణాం... శరీరంలో ఉన్న స్టార్చ్ మరియు కొవ్వు పదార్థాల నుండి, క్లోరోజెనిక్ ఆసిడ్ చక్కెరలను గ్రహించి శరీర బరువులో వ్యత్యాసాలను కలుగచేస్తుంది.
ఇతర లాభాలు
క్లోరోజెనిక్ ఆసిడ్ వలన ఇతర లాభాలు కూడా ఉన్నాయి, ఈ ఆసిడ్ లు మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. జర్నల్స్ ఆఫ్ సైకోఫార్మకాలజీ వారు, 2012 లో ప్రచురించిన దాని ప్రకారం, కెఫీన్ ను కలిగి ఉన్న, కాఫీలలో క్లోరోజెనిక్ ఆసిడ్ అధికంగా ఉంటుంది మరియు కెఫీన్ లేని కాఫీలలో క్లోరోజెనిక్ ఆసిడ్ పుష్కలంగా ఉంటుందని మరియు ఇవి వ్యక్తి యొక్క మానసిక స్థితిని మామూలు స్థితికి తీసుకు వస్తాయని తెలిపారు.
తప్పక తీసుకోండి
చాలా రకాల ఉత్పత్తులలో వాటి పైన ఉన్న లేబుల్ లో పేర్కొన్న దాని కంటే, ఆ ఉత్పత్తిలో గ్రీన్ టీ బీన్ సారం స్థాయిలు వేరుగా ఉంటాయి. ఒకవేళ మీరు గ్రీన్ కాఫీ బీన్స్ సారం ఉపభాగాలను వాడాలి అనుకుంటే, వీటిపై అవగాహన ఉన్న వారి సలహా లేదా ఇంతకూ ముందు వీటిని వాడిన వారి సలహా తీసుకోవటం మంచిది.
కావున, మీ శరీరా బరువు తగ్గించుకోవాలి అనుకుంటే, గ్రీన్ కాఫీ బీన్ సారం ఉపభాగాలను వాడండి. అంతేకాకుండా, వీటి వలన ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని వాడే ముందు, వైద్యుడిని సంప్రదించండి.
Also Read: Prabhas Marriage: 'రెబెల్ స్టార్' అభిమానులకు శుభవార్త.. ప్రభాస్ పెళ్లి ఈ ఏడాదే!!
Also Read: UPI Payments: ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్.. ఫీచర్ ఫోన్‌తో కూడా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook