UPI Payments: ఇంటర్నెట్​ లేకున్నా యూపీఐ పేమెంట్స్​.. ఫీచర్​ ఫోన్​తో కూడా!

UPI Payments: యూపీఐ పేమెంట్స్​ పేమెంట్స్​ చేసే వారికి గుడ్​ న్యూస్​. ఇకపై ఇంటర్నెట్​ అవసరం లేకుండానే యూపీఐ లావాదేవీలు జరపొచ్చు. ఫీచర్​ ఫోన్ల ద్వారా కూడా ఈ సేవలు వినియోగించుకునే వీలుంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2022, 06:29 PM IST
  • ఇకపై ఆఫ్​లైన్​లోనూ యూపీఐ సేవలు
  • కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చిన ఆర్​బీఐ
  • ఫీచర్​ ఫోన్లు వాడే వారికోసం ప్రత్యేక సదుపాయం
UPI Payments: ఇంటర్నెట్​ లేకున్నా యూపీఐ పేమెంట్స్​.. ఫీచర్​ ఫోన్​తో కూడా!

UPI Payments: ఇటీవలి కాలంలో డిజిటల్ పేమెంట్స్​ భారీగా పెరిగిపోయాయి. అందులో ఎక్కువగా యూపీఐ పేమెంట్సే. ఫోన్​పే, గూగుల్​పే, పేటీఎం వంటి యాప్​ల ద్వారా రోజు కొన్ని కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతుంటాయి. అయితే ఈ పేమెంట్స్ చేయాలంటే ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు ఆఫ్​లైన్​లో, ఇంటర్నెట్ అవరం లేకుండానే యూపీఐ పేమెంట్స్​ చేసే వీలుకల్పిస్తోంది నేషనల్​ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా (ఎన్​పీసీఐ).

ఫీచర్​ ఫోన్లు వాడే వారికీ డిజిటల్ పేమెంట్స్ సేవలు..

ఆఫ్​లైన్​లో, ఫీచర్​ ఫోన్ల ద్వారా కూడా యూపీఐ పేమెంట్స్ చేసేందుకు వీలుగా.. 'యూపీఐ123పే' అనే కొత్త సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ ఈ కొత్త సదుపాయాన్ని ప్రారంభించారు. ఫీచర్​ ఫోన్ వాడుతున్న వారికి కూడా డిజిటల్ పేమెంట్స్​ సేవలను అందించడమే లక్ష్యంగా ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు దాస్​.

దేశంలో 118 మంది మొబైల్ ఫోన్లు వాడుతుంటే అందులో 74 కోట్లు మాత్రమే స్మార్ట్​ఫోన్లు అని తెలిసింది. మిగత వారంతా ఫీచర్​ ఫోన్లను వాడుతున్నట్లు వెళ్లడైంది.

ఆఫ్​లైన్​లో ఎలా వినియోగించుకోవచ్చు?

  • బ్యాంకు ఖాతాతో అనుసంధానమైన మొబైల్ నంబర్​ నుంచి *99# డయల్ చేయాలి
  • ఇందులో సెండ్ మనీ, రిక్వెస్ట్​ మనీ, బ్యాలెన్స్ చెక్, మై ప్రొఫైల్​, పెండింగ్​ రిక్వెస్ట్​, ట్రాన్సాక్షన్స్​, యూపీఐ పిన్ వంటి ఆప్షన్స్​ కనిపిస్తాయి.
  • అందులో మీకు ఏ ఆప్షన్ కావలో ఎంచుకోవాలి
  • ఒకవేళ వేరే వ్యక్తికి డబ్బులు పంపించాలంటే.. సెండ్​ మనీ ఆప్షన్​ను సెలెక్ట్ చేయాలి
  • మొబైల్​ నంబర్​, యూపీఐ ఐడీ, బెనిఫీషియరీ, బ్యాంక్ అకౌంట్ ఇందులో ఏ ఆప్షన్​ ద్వారా డబ్బులు పెంపించాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోవాలి.
  • మొబైల్ నంబర్​ నుంచి పంపించాలి అనుకుంటే.. ఆ ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో ఆ వ్యక్తి మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
  • ఇక్కడ మీరు పంపించాలనుకుంటున్న వ్యక్తి వివరాలు వసకనిపిస్తాయి. అవన్నీ సరైనవే అయితే.. తర్వాతి ప్రాసెస్​కు వెళ్లాలి.
  • ఇప్పుడు ఎంత మొత్తం పంపించాలనుకుంటున్నారో ఎంటర్​ చాయాలి.. దానిని ధృవీకరించాలి.
  • ఆ తర్వాత యూపీఐ పిన్​ను ఎంటర్​ చేసి.. వెరిఫై చేయాలి. దీనితో పేమెంట్ పూర్తవుతుంది.
  • పేమెంట్ విజయవంతంగా పూర్తయితే బ్యాంక్​ నుంచి మెసేజ్ వస్తుంది.

Also read: Todays Gold Rate: ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు

Also read: iPhone SE 3: యాపిల్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్​ఫోన్- రేపే మార్కెట్లోకి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News