Prabhas Marriage: 'రెబెల్ స్టార్' అభిమానులకు శుభవార్త.. ప్రభాస్‌ పెళ్లి ఈ ఏడాదే!!

Prabhas Wedding prediction. అక్టోబరు 2022 నుంచి అక్టోబరు 2023 మధ్యలో ఎప్పుడైనా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ పెళ్లి జరగవచ్చని జ్యోతిష్యుడు ఆచార్య వినోద్‌ కుమార్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో చెప్పుకొచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2022, 05:56 PM IST
  • 'రెబెల్ స్టార్' అభిమానులకు శుభవార్త
  • ప్రభాస్‌ పెళ్లి ఈ ఏడాదే
  • మార్చి 11న రాధేశ్యామ్‌ విడుదల
Prabhas Marriage: 'రెబెల్ స్టార్' అభిమానులకు శుభవార్త.. ప్రభాస్‌ పెళ్లి ఈ ఏడాదే!!

Astrologer Acharya Vinod Kumar prediction about Prabhas Marriage: భారతీయ సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఇద్దరే ఇద్దరు. ఒకరు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కాగా.. మరొకరు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌. పెళ్లెప్పుడని 56 ఏళ్ల సల్లు భాయ్‌ని అడిగి అడిగి అందరూ విసిగిపోయారు. దాంతో ఇటీవలి కాలంలో ఆయన పెళ్లి విషయంపై ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం 42 ఏళ్ల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ పెళ్లిపై ప్రతిఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

'బాహుబలి' సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటానని వాళ్ల ఇంట్లో చెప్పినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ప్రభాస్‌ తెలిపారు. కానీ ఇప్పటికీ వరకు ఆ జాడే లేదు. అటు ప్రభాస్ కానీ.. ఇటు కృష్ణం రాజు కానీ ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దాంతో సోషల్ మీడియాలో రెబెల్ స్టార్ పెళ్లిపై చాలా రకాల రూమర్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా బుజ్జుగాడి వివాహం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. 42 ఏళ్లు ఉన్న ప్రభాస్‌.. ఈ ఏడాదే పెళ్లి చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయని ప్రముఖ జ్యోతిష్యుడు ఆచార్య వినోద్‌ కుమార్‌ అంటున్నారు. 

'హీరో ప్రభాస్‌ పెళ్లి ఎప్పుడు అని గత రెండు సంవత్సరాలుగా మెసేజెస్, మెయిల్స్ వస్తున్నాయి. అందరూ ఆయన పెళ్లిపై ఆసక్తిగా ఉన్నారు. రెబెల్ స్టార్ పుట్టిన తేదీ ప్రకారం.. ప్రభాస్‌ త్వరలోనే వివాహం చేసుకుంటారు. అక్టోబరు 2022 నుంచి అక్టోబరు 2023 మధ్యలో ఎప్పుడైనా ఆయన పెళ్లి జరగవచ్చు. ఇది పాన్‌ ఇండియా స్టార్‌ విషయంలో నా జ్యోతిష్యం' అని జ్యోతిష్యుడు ఆచార్య వినోద్‌ కుమార్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. వినోద్‌ కుమార్‌ చెప్పినట్లే ప్రభాస్‌ పెళ్లి జరుగుతుందా? లేదా? చూడాలి. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Acharya vinod kumar (@acharyavinodkumar)

ప్రభాస్‌ నటించిన 'రాధేశ్యామ్‌' సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హస్తసాముద్రికా నిపుణుడిగా రెబెల్ స్టార్ కనిపించనున్నారు. రాధేశ్యామ్‌ సినిమాను రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించగా.. పూజాహెగ్డే కథానాయిక. ఈ సినిమాతో పాటు 'సలార్‌', 'ఆది పురుష్‌', 'ప్రాజెక్టు కె' చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న ఏకైక తెలుగు హీరో ప్రభాస్‌. ఆయన చేస్తున్న సినిమాల బడ్జెట్‌ రూ.1000కోట్లకు పైనే ఉంది. 

Also Read: RCB New Captain: 12న కొత్త కెప్టెన్‌ని ప్రకటించనున్న ఆర్‌సీబీ.. ఎవరో తెలుసా?! కోహ్లీకి కూడా ఇష్టమేనట!!

Also Read: BJP MLA'S: సస్పెన్షన్‌పై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎమ్మెల్యేలు.. వేర్వేరుగా పిటిషన్లు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News