How To Reduce High Blood Pressure Naturally At Home: మనం ప్రతిరోజు వంటల్లో వినియోగించే పదార్థాల్లో వెల్లుల్లి, అల్లం, ఉల్లి కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా వెల్లుల్లి విషయానికొస్తే ఇది వంటల రుచిని రెట్టింపు చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు వంటలు రుచిని పెంచడమే కాకుండా శరీరాన్ని కూడా చాలా రకాలుగా సహాయపడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి ఒక ఔషధంలా పనిచేస్తుంది. అందుకే దీనికి ఆయుర్వేద శాస్త్రంలో అత్యంత కలిగిన పదార్థాల్లో ఒకటిగా పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తింటే రక్త సరఫరా వ్యవస్థ మెరుగుపడుతుంది. అయితే వెల్లుల్లిని కాల్చి తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు రెట్టింపు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిని వేయించి గాని కాల్చి గాని రాత్రి పడుకునే ముందు తింటే రక్తప్రసరణ, రక్తపోటు సమస్యలు సులభంగా దూరమవుతాయని నిపుణులు అంటున్నారు. వెల్లుల్లి ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి కాపాడేందుకు శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.


ఈ వెల్లుల్లిని ఆహారం తీసుకునే క్రమంలో ప్రతిరోజు తీసుకుంటే మహిళల కంటే పురుషులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు పురుషులకు వీర్యకణాల నాణ్యతను పెంచేందుకు తోడ్పడతాయి. అంతేకాకుండా ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది స్త్రీలు పురుషులు చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలైతే సంతానం లేని సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి వెల్లుల్లి రెబ్బలు ఔషధంలా ఉపయోగపడతాయని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు.


ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారికి కాల్చిన వెల్లుల్లి రెబ్బలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీటిని రాత్రిపూట పడుకునే ముందు తీసుకోవడం వల్ల పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ సులభంగా కరుగుతుంది. అంతేకాకుండా శరీర బరువు కూడా సులభంగా తగ్గుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టాలనుకునేవారు తప్పకుండా వెల్లుల్లి రెబ్బలను రాత్రి పూట తినాలి.


Also Read: India Chokers: టీమిండియాను చోకర్స్‌ అని పిలవడంలో తప్పేమీ లేదు.. కపిల్‌ దేవ్‌ కీలక వ్యాఖ్యలు!  


Also Read: Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ జోడో యాత్రలో విషాదం.. ఇద్దరిని ఢీకొట్టిన ట్రక్.. ఒకరు మృతి   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook