India Chokers: టీమిండియాను చోకర్స్‌ అని పిలవడంలో తప్పేమీ లేదు.. కపిల్‌ దేవ్‌ కీలక వ్యాఖ్యలు!

Kapil Dev slams Indian Team after exit from T20 World Cup 2022. ఐసీసీ ఈవెంట్లలో విఫలమవుతున్న భారత్‌ జట్టును ఇప్పుడు ‘చోకర్స్’గా పిలవొచ్చని భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ పేర్కొన్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 11, 2022, 03:55 PM IST
  • టీమిండియాను చోకర్స్‌ అని పిలవడంలో తప్పేమీ లేదు
  • కపిల్‌ దేవ్‌ కీలక వ్యాఖ్యలు
  • ఒక్కసారి మాత్రమే టైటిల్
India Chokers: టీమిండియాను చోకర్స్‌ అని పిలవడంలో తప్పేమీ లేదు.. కపిల్‌ దేవ్‌ కీలక వ్యాఖ్యలు!

You Can Call Chokers Now, Kapil Dev sensational comments On Team India: గత కొన్ని సంవత్సరాలుగా ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఘోరంగా వైఫల్యం చెందుతూ వస్తోన్నా విషయం తెలిసిందే. 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్.. 2013లో ఛాంపియన్ ట్రోఫీ నెగ్గింది. ఆపై 2015, 2016, 2019, 2021 ప్రపంచకప్‌లలో ఫైనల్ చేరలేదు. టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021 ఫైనల్లో భారత్ ఓడింది. తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. ఇంగ్లీష్ జట్టుపై కనీసం పోరాటం చేయకుండా చేతులెత్తేయడంతో భారత అభిమానులను మరింత బాధించింది.

టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీ ఫైనల్లో ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వలేకపోయిన టీమిండియాపై పలువురు భారత క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ ఈవెంట్లలో విఫలమవుతున్న భారత్‌ జట్టును ఇప్పుడు ‘చోకర్స్’గా పిలవొచ్చని పేర్కొన్నారు. అయితే భారత ప్రదర్శనపై మరీ దారుణంగా మాట్లాడాల్సిన అవసరంలేదని ఓ ఇంగ్లీష్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఐసీసీ టోర్నీల్లో ఉండే ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేసే జట్లను క్రికెట్‌ పరిభాషలో ‘చోకర్స్’గా అభివర్ణిస్తారు.

'భారత జట్టును ఇప్పుడు చోకర్స్‌ అని పిలవడంలో ఎలాంటి తప్పు లేదు. ఇటీవలి ఐసీసీ టోర్నీలలో చెత్తగా ఆడుతోంది. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో కాస్త పరుషమైన పదాలను నేను వాడదల్చుకోలేదు. ఎందుకంటే.. భారత జట్టులోని కొందరు ఆటగాళ్లు కొన్ని సంవత్సరాల నుంచి వ్యక్తిగతంగా బాగా రాణిస్తున్నారు. అందుకే ఇంగ్లండ్‌పై భారత్ ఓడినప్పటికీ.. అభిమానులు, విశ్లేషకులు, నెటిజన్లు మరీ దారుణంగా మాట్లాడాల్సిన అవసరం లేదు' అని కపిల్‌ దేవ్‌ పేర్కొన్నారు. 

కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టు 1983 వన్డే ప్రపంచకప్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత్ ఖాతాలో మొత్తం నాలుగు ఐసీసీ టోర్నీలు ఉన్నాయి. 1983 వన్డే ప్రపంచకప్‌ అనంతరం ఎంఎస్ ధోనీ సారథ్యంలో 2007లో టీ20 ప్రపంచకప్‌ సాధించింది. 2011 ప్రపంచకప్‌, ఛాంపియన్ ట్రోఫీ 2013లను కూడా మహీ సారథ్యంలోనే భారత్ సొంతం చేసుకొంది. 2007 నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు చేరుకున్న భారత్.. ఒక్కసారి మాత్రమే టైటిల్ అందుకుంది.

Also Read: Shoaib Akhtar: అయ్యోపాపం ఎంతపనాయె.. ఇక భారత్‌తో పాకిస్తాన్ ఫైనల్‌ ఆడలేదు! షోయబ్‌ అక్తర్‌ ఎద్దేవా  

Also Read: Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ జోడో యాత్రలో విషాదం.. ఇద్దరిని ఢీకొట్టిన ట్రక్.. ఒకరు మృతి   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News