Senagala Salad Recipe: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది చిన్న వయస్సులోనే బరువు పెరగడం, అధిక రక్తపోటు వంటి సమస్యలను ఎదర్కొంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జీవనశైలిలో మార్పులతో పాటు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఉదయాన్నే అల్ఫారంలో భాగంగా సలాడ్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ప్రతి రోజు అల్పాహారంలో శనగలతో తయారు చేసి సలాడ్‌ తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు, ఫైబర్‌ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోషకాహారాల గని: శనగల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియంతో పాటు ఫాస్పరస్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా..దృఢంగా తయారవుతుంది. 


గుండె ఆరోగ్యానికి మంచిది: శనగలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని గుండెను రక్షిస్తాయి.


బరువు తగ్గడానికి: శనగలలో అధిక ప్రోటీన్‌తో పాటు ఫైబర్ ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండినట్లుగా భావించేలా చేస్తాయి. అంతేకాకుండా ఆకలిని నియంత్రించి బరువును తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు మధుమేహాన్ని నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది. 


హై ప్రోటీన్ శనగల సలాడ్‌కి కావాల్సిన పదార్థాలు:
శనగలు (ఉడికించినవి) - 2 కప్పులు
కోడిగుడ్లు (ఉడికించి, ముక్కలు చేసుకున్నవి) - 2
బంగాళదుంప (ఉడికించి, ముక్కలు చేసుకున్నవి) - 1
టొమాటోలు (తరిగినవి) - 1
ఉల్లిపాయ (తరిగినది) - 1/2
కీరదోసకాయ (తరిగినది) - 1/2
పచ్చిమిర్చి (తరిగినది) - 1
కొత్తిమీర (తరిగినది) - 1/4 కప్పు
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
ఆలివ్ ఆయిల్ - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - 1/2 టీస్పూన్


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


తయారీ విధానం:
ఈ సలాడ్‌ను తయారు చేసుకోవడానికి పెద్ద బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఒక గిన్నెలో శనగలు, కోడిగుడ్లు, బంగాళదుంప, టొమాటోలు, ఉల్లిపాయ, కీరదోసకాయ, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి వేసి మరోసారి బాగా కలపాలి.
చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి వెంటనే సర్వ్ చేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి