Home Remedies for Nerve Pain: మనలో కొన్ని వ్యాధులు లేదా సమస్యలు వయస్సు లేదా ఆడ, మగ అని చూసి రావు. ఇవి ఎవరికైనా లేదా ఎప్పుడైనా కలగవచ్చు. అందులో ఒకటి నరాలు కుంచించుకు పోవటం లేదా నరాల్లో నొప్పి. శరీరంలో ఏదైనా నరం లాగబడిన లేదా నొక్కినా నొప్పి ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఇలాంటి నరాల నొప్పికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ నొప్పికి గల కారణాల గురించి ఆలోచించకుండా.. నరాల నొప్పిని ఎలా తగ్గించుకోవాలనే ఉపాయాల గురించి తెలుసుకుందాం. కొన్ని ఇంటి చిట్కాలను అనుసరించి నరాల నొప్పిని త్వరితంగా తగ్గించుకోవచ్చు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్నానం చేసేటప్పుడు ఇలా చేయండి!
శరీరంలోని ఏదైనా భాగంలో నరాల నొప్పి కలిగితే.. స్నానం చేసేటప్పుడు రాక్ సాల్ట్ ను ఉపయోగించాలి.  రాక్ సాల్ట్ ఎంతో  ప్రయోజనకరంగా ఉంటుంది. ఉప్పులో మెగ్నీషియం ఉంటుంది కాబట్టి స్నానం చేసే సమయంలో నీటిలో రెండు కప్పుల రాక్ సాల్ట్ వేసి.. నొప్పి ఉన్న ప్రదేశాన్ని అరగంట పాటు నానబెట్టి ఉంచాలి. ఇది నొప్పి పై తొందరగా ప్రభావాన్ని చూపుతుంది. 


మసాలాను వినియోగించండి 
నరాల నొప్పి నుండి ఉపశమనాన్ని పొందడానికి ఆహారంలో పసుపుని ఉపయోగించాలి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఈ గుణాలు నరాల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు పాలలో 1/4 టీస్పూన్ పసుపు వేసి.. అందులో చిటికెడు నల్ల మిరియాల పొడిని కూడా కరిగించాలి. తర్వాత ఈ పాలను వేడి చేసి ప్రతి వారానికి ఒకసారి త్రాగాలి. దీని ద్వారా నరాల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.


Also Read: ICC World Cup 2023: ఈసారి ప్రపంచకప్‌లో మూడు కొత్త నిబంధనలతో సిద్ధమైన ఐసీసీ


యాపిల్ సైడర్ వెనిగర్ కూడా మంచి చికిత్స 
ఆపిల్ సైడర్ వెనిగర్ శరీరం యొక్క అనేక సమస్యలను తొలగించడానికి ఉపయోగించబడుతుంది. ఆ సమస్యలలో న్యూరల్జియా కూడా ఉంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం మరియు పొటాషియం ఉంటాయి. ఇవి నరాల నొప్పిపై తొందరగా ప్రభావాన్ని చూపిస్తుంది.దీని కోసం, ఒక గ్లాసు వేడి నీటిలో 2-3 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి.. దానితో పాటు ఒక చిన్న చెంచా తేనెను కూడా కలిపితే అది రుచిగా కూడా  ఉంటుంది. దీన్ని బాగా కలిపి వారానికి రెండు సార్లు తాగడం ద్వారా నరాల నొప్పులు తగ్గుతాయి.


Also Read: Flipkart Big Billion Days Sale 2023: మోటోరోలా స్మార్ట్‌ఫోన్లపై ఊహించని ఆఫర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook