Vitamin B-12 side effects: మితంగా తీసుకుంటే ఔషధం ..మితిమీరి తీసుకుంటే విషం..
Vitamin B12 Overdose: విటమిన్ బి12 వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అందుకే ఈ విటమిన్ లభించే ఆహారాలు మన రోజు వారి డైట్ లో ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మాత్రం విటమిన్ బి 12 లోపించింది అన్నప్పుడు టాబ్లెట్లు..ఇంజక్షన్స్ వేసుకునేద్దామనుకుంటారు కొంతమంది. కాగా విటమిన్ బి12 ఎక్కువ అయితే దానివల్ల ప్రమాదాలు కూడా ఎన్నో ఉన్నాయి అంటున్నారు నిపుణులు.
Vitamin B12: ఏదైనా మితంగా తింటే అమృతం.. మితిమీరి తింటే విషం.. ఇది మన పెద్దలు చెప్పిన మాటే. మన ఆహారంలో పోషక విలువలు తగినంత ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. కానీ ఈ పోషక విలువలు ఎక్కువైతే కూడా మన ఆరోగ్యానికి అపాయమే అంటున్నారు వైద్య నిపుణులు. ఇందులో ముఖ్యమైనది విటమిన్ బి12. విటమిన్ బి12 అనేది మన ఆరోగ్యానికి చాలా అవసరమైనది. అయితే కొంతమందిలో ఇది లోపిస్తా ఉంది అని తెలియగానే దానికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకుంటూ ఉంటారు. బి12 ఎక్కువగా ఉందే ఆహారం తీసుకోవడం అలానే టాబ్లెట్లు వేసుకోవడం కూడా చేస్తూ ఉంటాడు. అయితే శరీరానికి విటమిన్ బి12 ఎక్కువైనా హానికరమే. అవును మీరు విన్నది నిజమే..మరి అధిక మోతాదులో విటమిన్ బి-12 తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటి .. అసలు ఇది ఎంత తీసుకుంటే న అనేది ఒకసారి చూద్దాం.
ఎక్కువ అయితే వచ్చే ప్రమాదాలు..
విటమిన్ బి-12 అధికమైతే మైకం రావడం, వాంతులు అవ్వడం కూడా జరుగుతుంది. తలనొప్పి, వాపు,చర్మంపై దద్దుర్లు, దురద, వికారం, వాంతులు, అలసట, జలదరింపు వంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతాయి. ఇక ఈ విటమిన్ మరీ ఎక్కువ అయితే అనాఫిలాక్సిస్ అనే అలర్జిక్ రియాక్షన్ వస్తుంది. దీనివల్ల ముఖం, నాలుక, గొంతు వాపు సమస్యలు వస్తాయి. కాబట్టి విటమిన్ బి 12 ని మితిమీరి అసలు తీసుకోకూడదు.
ఇవి తీసుకుంటే చాలు…
అంతేకాదు విటమిన్ బి12 డెయిరీ ప్రొడక్ట్స్, మాంసం, బలవర్థకమైన తృణధాన్యాలను తినని వారు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి తినేవాడికి కావాల్సినంత విటమిన్ బి12 వాటి ద్వారానే లభిస్తుంది.
ఇంజక్షన్స్ అస్సలు వద్దు…
మరో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే విటమిన్ బి12 ఇంజక్షన్స్ డాక్టర్ చెబితే తప్ప తీసుకోకపోవడమే మంచిది. కండరాల్లో ఈ ఇంజక్షన్లు చేస్తారు. వీటిలో సాధారణంగా హైడ్రాక్సోకోబాలమిన్ లేదా సైనోకోబాలమిన్ ఉంటాయి. ఈ ఇంజెక్షన్ల త్వరగా, మరింత ఎక్కువగా శరీరంలో బి-12 కలిసేలా చేస్తాయి. అందుకే వీటి అతి వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం చాలానే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎంత తీసుకుంటే మంచిది…
నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆఫ్ డైటరీ సప్లిమెంట్స్ ప్రకారం, 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ప్రతిరోజూ 2.4 మైక్రోగ్రాములు విటమిన్ బి-12 తీసుకోవాలి. ప్రెగ్నెంట్ మహిళలు 2.6 మైక్రోగ్రాములు, పాలిచ్చే మహిళలు 2.8 మైక్రోగ్రాములు, 50 ఏళ్లు పైబడిన వ్యక్తులు 25-100 మైక్రోగ్రాములు బి-12 తీసుకుంటే సరిపోతుంది.
కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని విటమిన్ బి12 సప్లిమెంట్స్ తీసుకోవడం శ్రేయస్కరం.
Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే
Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి