Telangana Liquor Update: మద్యం ఆరోగ్యానికి హానికరం అని..ఎన్ని చోట్ల బహిరంగంగా ప్రకటించిన..సరే మందుబాబులు దీనికి విరుద్ధంగానే..వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఒక్క పూట చుక్క లేనిదే..జీవితం గడవదు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. అయితే ఇలాంటి వారికి.. షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
ఇటీవల కాలంలో అత్యధిక టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో సమయం, సందర్భం లేకపోయినా సరే చాలామంది ఒక పెగ్ అయినా వేయాల్సిందే.. అన్నట్టుగా మారిపోయారు. స్ట్రెస్ లో ఉన్నా మందు తాగుతారు.. సంతోషంగా ఉన్నా మందు తాగుతారు. అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేసినా, బ్రేకప్ చెప్పినా, పెళ్లి చేసుకున్నా, విడిపోయినా.. ఇలా ఏది జరిగినా సరే మందు కంపల్సరిగా ఉండాల్సిందే. అంతలా మందుబాబులు దీనికి అడిక్ట్ అయ్యారు.
దీనికి తోడు సినిమాలలో.. కూడా వీటిని ఎక్కువగా పాపులర్ చేస్తున్నారనే చెప్పాలి. తెర పైన హీరో, హీరోయిన్స్ మందు తాగుతున్నట్టు చూపిస్తారు. కానీ కింద చిన్న అక్షరాలతో.. మద్యం తాగడం హానికరం అంటారు. మరి ఇదెక్కడి చోద్యమో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా మందు తాగే వారు మాత్రం మానలేదు. ఇలాంటి వారి కోసం హెచ్చరికగా.. తెలంగాణ ప్రభుత్వం భారీ ధరలు పెంచుతూ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ధరలు పెంపు అనేది అటు ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయాన్ని అందిస్తుంది అని చెప్పవచ్చు.
ఇకపోతే తాజాగా తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మందు ధరలు భారీగా పెరగనున్నట్లు సమాచారం. ఒక్కో బీరుపై 20 రూపాయలు పెరిగే అవకాశం ఉండగా.. లిక్కర్ పై రూ .20 నుంచి ఏకంగా రూ .70 వరకు పెంచేందుకు ప్రయత్నాలు.. జరుపుతున్నట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది.
దీంతో ప్రతి నెల రూ.1000 కోట్లు అదనంగా ఆదాయం వచ్చేందుకే ఈ ధరలు పెంచుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ నిర్ణయం పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న తర్వాత మందు ధరల పెంపు పై ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలంగాణలో మందుబాబులకు గట్టి షాక్ తగలనుంది. ఒక్కో బీరుపై 20 రూపాయలు, ఒక్కో లిక్కర్ పై 70 రూపాయల వరకు పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈ దెబ్బతోనైనా మందుబాబులు మందు తాగడం మానేస్తారేమో చూడాలి.