Detox Drink: శరీరంలోపల పేరుకుపోయిన వ్యర్ధాల్ని శుభ్రం చేసేందుకు చాలా రకాల చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని హోమ్ రెమిడీస్ ద్వారా వ్యర్ధాల్ని ఎలా తొలగించుకోవచ్చో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మనిషి శరీరంలో వివిధ రకాల వ్యర్ధాలు పేరుకుపోతుంటాయి. ఫలితంగా చాలా రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. స్థూలకాయం, కడుపు సమస్య, అధిక రక్తపోటు వంటివి ఇలానే వస్తాయి. ఈ సమస్యల్నించి రక్షించుకునేందుకు శరీరాన్ని తక్షణం డీటాక్సిఫై చేసుకోవాలి. శరీరంలోని వ్యర్ధాల్ని తొలగించేందుకు వైద్య నిపుణులు ఎన్నో రకాల హెల్తీ డైట్ తీసుకోమని సూచిస్తుంటారు. ఈ డైట్‌లో భాగంగా కొన్ని డ్రింక్స్ మీ శరీరంలోని వ్యర్ధాల్ని శుభ్రం చేయడంతో పాటు బరువు కూడా తగ్గిస్తాయి.


దాల్చిన చెక్క, తేనె డ్రింక్


దాల్చిన చెక్క, తేనె డ్రింక్..శరీరం నుంచి వ్యర్ధాల్ని శుభ్రం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది మనిషి శరీరానికి చాలా ఉపయోగకరం. దాల్చినచెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్. యాంటీ ఫంగస్ గుణాలున్నాయి. ఇవి శరీరపు వ్యర్ధాల్ని శుభ్రం చేయడంలో సహాయపడతాయి. అటు తేనె కూడా యాంటీ ఆక్సిడెంటల్ గుణాలతో నిండి ఉంటుంది. ఈ రెండింటి మిశ్రమం శరీరానికి చాలా లాభదాయకంగా ఉంటుంది. 


పుదీనా కీరా డ్రింక్


పుదీనా కీరా డ్రింక్ కూడా శరీరంలో పేరుకున్న వ్యర్ధాల్ని శుభ్రం చేస్తుంది. వాస్తవానికి కీరాలో 90 శాతం నీరే ఉంటుంది. ఫలితంగా మిమ్మల్ని ఎక్కువసేపు హైడ్రేట్‌గా ఉంచుతుంది. అటు పుదీనా ఆకుల్లో చాలా రకాల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలున్నాయి. దాంతో ఈ డ్రింక్ ఆరోగ్యాన్నివ్వడమే కాకుండా శరీరంలోని వ్యర్ధాల్ని తొలగిస్తుంది. 


Also read: Dark Circles: కంటి కింద నల్లటి వలయాలతో బాదపడుతున్నారా..ఇలా చేస్తే చాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.