చలికాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు సాధారణం. చలికాలంలో చాలామందికి ఛాతీలో కఫం పేరుకుపోయి ఇబ్బంది కల్గిస్తుంటుంది. అసలు కఫం అంటే ఏమిటి , ఇది శరీరానికి మంచిదా కాదా అనేది తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కఫం అనేది ఊపిరితిత్తుల్లో తయారయ్యే ఓ పదార్ధం. వాస్తవానికి ఇది ఆరోగ్యానికి మంచిదే. ఎందుకంటే కఫం మన ఊపిరితిత్తుల్లో దుమ్ము ధూళి కణాలు పేరుకుపోకుండా కాపాడుతుంది. బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. అదే కఫం ఎక్కువైతే మాత్రం వివిధ రకాల సమస్యలు ఏర్పడతాయి. ఫలితంగా దగ్గు, జలుబు, గొంతులో మంట వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఈ క్రమంలో కఫం పేరుకుపోయినప్పుడు ముఖ్యంగా ఆహారపు అలవాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మీక్కూడా ఛాతీలో కఫం పేరుకుపోతే కొన్ని పదార్ధాల్ని డైట్‌లో చేర్చడం ద్వారా తొలగించవచ్చు.


ఛాతీలో పేరుకున్న కఫం తొలగించే పదార్ధాలు


అల్లం


అల్లం అనేది నేచురల్ డికాగ్నెస్టెంట్. ఛాతీలో పేరుకున్న కఫంను తొలగించేందుకు అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే అల్లంలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గొంతు, ఛాతీలో పేరుకున్న అదనపు కఫంను సులభంగా బయటకు పంపించడంలో దోహదపడతాయి. అందుకే ఛాతీలో కఫం సమస్య ఉంటే..అల్లం మంచి ప్రత్యామ్నాయం.


ఉల్లిపాయలు


జలుబు, దగ్గు, ఛాతీలో కఫం సమస్యను దూరం చేసేందుకు ఉల్లిపాయల్ని వినియోగించవచ్చు. ఉల్లిపాయలు జ్వరం, గొంతు గరగర సమస్యల్ని చాలావరకూ తగ్గిస్తాయి. ఒకవేళ మీ ఛాతీలో పేరుకున్న కఫంతో ఇబ్బంది పడుతుంటే..ఉల్లిపాయను గుజ్జుగుజ్జుగా చేసి 6 గంటల వరకూ నీళ్లలో నానబెట్టాలి. రోజూ 3 చెంచాల నీళ్లను తాగితే ఛాతీ నుంచి కఫం దూరమౌతుంది.


Also read: Cholesterol: చలికాలంలో పొరపాటున కూడా ఇవి తినొద్దు, కొలెస్ట్రాల్ వేగంగా పెరిగే ప్రమాదం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook