Skin Care Foods: అందంగా , ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ముఖ సౌందర్యం , చర్మ సంరక్షణ కోసం చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. ఒక్కోసారి ప్రయోజనం కలగకపోగా దుష్పరిణామాలు వెంటాడుతాయి. చర్మ సంరక్షణ కోసం కృత్రిమంగా అవలంభించే ఏ పద్ధతులు కూడా మెరుగైన ఫలితాలనివ్వదు. ఇది మంచిది కూడా కాదంటారు బ్యుటీషియన్లు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందుకే అందానికి మెరుగులు దిద్దుకోవాలన్నా..చర్మం నిగనిగలాడాలన్నా సహజసిద్ధమైన పద్దతులనే ఆశ్రయించాలి. మార్కెట్‌లో లభించే వివిధ రకాల క్రీముల వల్ల ఆరోగ్యపరంగా హాని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే చర్మ సంరక్షణకు డైట్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. అంటే తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉండేట్టు చూసుకుంటే కచ్చితంగా మీ చర్మం నిగనిగలాడుతుంది. 


చర్మం జీవం కోల్పోవడం, నిర్జీవంగా మారడం, ముడతలు పడటం, చారల్లాంటివి కన్పిస్తూ వృద్ధాప్య లక్షణాలు త్వరగా బయటపడటం ప్రధానమైన సమస్యలు. రోజూ తగినంత నిద్ర లేకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, సరైన పోషకాలుండే ఆహారం తినకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. అందుకే మీ చర్మం తిరిగి నిగనిగలాడాలంటే..వృద్ధాప్య లక్షణాలకు చెక్ పెట్టాలంటే ఆహారంలో మార్పులు అవసరం. దీనికోసం చేపలు, సోయా ఉత్పత్తులు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఎందదుకంటే ఈ రెండింటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషన్ దూరమై..చర్మం కాంతివంతంగా మారుతుంది. 


విటమిన్ సి, విటమిన్ ఇ, బీటో కెరోటిన్ అధికంగా ఉండే బొప్పాయిని రోజూ తీసుకుంటే చాలా మంచి ఫలితాలు చూడవచ్చు. ముఖ్యంగా చర్మంపై ఉండే డెడ్ సెల్స్ దూరమై చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇక మరో పదార్ధం క్యారెట్. ఇందులో విటమిన్ ఎ కావల్సినంతగా లభిస్తుంది. రోజూ క్యారెట్ తినడం వల్ల కంటికి, చర్మానికి చాలా ప్రయోజనకరం. అంతేకాకుండా ఇన్‌ఫెక్షన్ ప్రభావం కూడా తగ్గుతుంది. 


రెడ్ క్యాప్సికమ్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే కెరోటినాయిడ్స్ చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి. ఆకుకూరల్లో పాలకూర అత్యద్బుతమైంది. శరీరంలోని వ్యర్ధాల్ని తొలగించడంలో పాలకూర చాలా బాగా పనిచేస్తుందంటారు. రోజూ కాకపోయినా వారానికి 4 సార్లు పాలకూర తింటే చర్మ సంరక్షణతో పాటు చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చంటున్నారు. ఎందుకంటే పాలకూరలో కాల్షియం, ఐరన్,. మెగ్నీషియం వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.


చాలామందికి చాకోలేట్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు డార్క్ చాకోలేట్స్ తినడం అలవాటు చేసుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందడంతో శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తొలగిపోతాయి. ఫలితంగా ఏజీయింగ్ ప్రక్రియ మందగిస్తుంది. చర్మంపై తిరిగి యౌవనం కన్పిస్తుంది. అంటే చర్మం మృదువుగా మారుతుంది. 


Also read: Cholesterol Remedies: ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే..కొలెస్ట్రాల్ ఎంత ఉన్నా ఇట్టే మాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook