దేశంలో వర్షాకాలం పూర్తి కావచ్చింది. చలికాలం ప్రారంభం కానుండటమే కాకుండా..అప్పుుడే దేశంలో చలిగాలులు వీస్తున్నాయి. చలికాలం ప్రారంభం కాగానే..సీజనల్ వ్యాధులు ప్రారంభం కావచ్చు. ఈ ఇబ్బందుల్నించి ఎలా గట్టెక్కడం అనేది చాలా ముఖ్యం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీజన్ మారగానే సీజనల్ వ్యాధుల ముప్పు అధికమౌతుంది. అదే సమయంలో ఆరోగ్యపరంగా కొంత మంచి కూడా జరుగుతుంది. లేదా సమస్యలకు గురికావచ్చు. చలికాలం అనేది చర్మ ఆరోగ్యానికి మంచిది కాదు.  ఈ సీజన్‌లో వివిధ రకాల చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల్నించి గట్టెక్కేందుకు వివిధ రకాల ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. ఇవి ఖరీదైనవే కాకుండా..సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సాధారణంగా చలికాలంలో ఎక్కువగా ఉపయోగించే లోషన్, క్రీమ్ వంటివి ఎక్కువసేపు చర్మాన్ని డ్రై కాకుండా ఉంచలేవు. కొన్ని సహజసిద్ధమైన క్రీమ్స్ సహాయంతో ఈ సమస్య నుంచి దూరం కావచ్చు.


బాదం అలోవెరా స్కిన్ క్రీమ్ లాభాలు


బాదం-అలోవెరాలో చాలా రకాల పోషకలుంటాయి. చర్మ సంరక్షణకు ఇవి చాలా మంచిది. ఇవి చర్మం డ్రై కాకుండా చేస్తాయి. చర్మం దెబ్బతినకుండా చేయడంలో దోహదపడతాయి. అలోవెరా చర్మంలోని తేమను కొనసాగిస్తుంది. చర్మం మాయిశ్చరైజర్ స్థాయి సరిగ్గా ఉంటుంది. బాదం-అలోవెరా వాడటం వల్ల చలికాలంలో కూడా చర్మం నిగారింపుతో, కళకళలాడుతుంటుంది. చలికాలం సమయంలో చర్మంలో మంట, దురద సహా చాలా సమస్యలు తలెత్తుతాయి. నేచురల్ క్రీమ్ ఈ సమస్యను దూరం చేస్తుంది. 


బాదం-అలోవెరా క్రీమ్ ఎలా తయారు చేయాలి


ఈ క్రీమ్ తయారీకు పది బాదం పిక్కల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయం వాటిని పేస్ట్‌గా చేసుకోవాలి. ఓ గిన్నెలో 2 స్పూన్స్ అలోవెరా జ్యూస్ తీసుకుని అందులో బాదం పేస్ట్ కలపాలి. ఇందులో విటమిన్ క్యాప్యూల్స్ జెల్ 2-3 వేయాలి. అంతే మీ నేచురల్ క్రీమ్ సిద్దమైనట్టే. ఇందులో రోజ్ వాటర్ కూడా కలపవచ్చు. 


సహజంగా చాలామంది ఎండాకాలంలో తాగినంతగా చలికాలంలో నీళ్లు తాగరు. ఈ పొరపాటు చర్మం డ్రైనెస్‌కు కారణమౌతుంది. అందుకే నీళ్లు తాగడానికి సీజన్ సంబంధం లేదు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా 7-8 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాల్సిందే. బాడీలో నీరు తగిన మోతాదులో ఉంటే కచ్చితంగా చాలావరకూ చర్మ సమస్యలు దూరమౌతాయి.


Also read: Cardamom For Skin: తరుచుగా ఇలా చర్మ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే కేవలం 5 రూపాయలతో ఇలా చెక్‌ పెట్టండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook