Skin Care with Neem: వేప పిండినితో ఇన్ని ప్రయోజనాలా.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!
Skin Care Tips: వేసవి కాలంలో చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో సతమతమవుతుంటారు. ఈ సీజన్‌లో ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్ ఉన్నవాళ్లు చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మండుతున్న ఎండల కారణంగా చర్మం రంగు కూడా నల్లగా మారే అవకాశాలున్నాయి.
Skin Care Tips: వేసవి కాలంలో చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో సతమతమవుతుంటారు. ఈ సీజన్‌లో ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్ ఉన్నవాళ్లు చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మండుతున్న ఎండల కారణంగా చర్మం రంగు కూడా నల్లగా మారే అవకాశాలున్నాయి. అందుకే ఈ సీజన్‌లో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేప సహాయంతో మచ్చలేని, మెరిసే ముఖాన్ని పొందవచ్చని అయుర్వేద శాస్త్రంలో పేర్కొంది. వేప, దాని ఉత్పత్తులలో అనేక సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
వైద్యుడు అబ్రార్ ముల్తానీ తెలిపిన వివరాల ప్రకారం.. చర్మం, జుట్టు సమస్యలను తొలగిస్తుందని వారు పేర్కొన్నారు. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు.. మొటిమలు, మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. వేప ద్వారా వివిధ రకాల సహజసిద్ధమైన వేప ఫేస్ ప్యాక్‌లను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వాటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ముఖానికి వేప మాస్క్‌లు:
1. తేనె వేపతో మాస్క్:
#మొదట కొన్ని వేప ఆకులను తీసుకోండి.
#దానికి కొద్దిగా నీరు కలపండి.
#వాటిని గ్రైండ్ చేసి మృదువైన పేస్ట్‌లా చేయండి.
#ఈ పేస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ తేనె కలపండి.
#బాగా కలపి మీ ముఖం, మెడపై అప్లై చేయండి.
#30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.
ప్రయోజనాలు: జిడ్డు చర్మానికి వేప ఫేస్ ప్యాక్ ఒక హోం రెమెడీ. దీనిని ఆయిల్ ఫేస్ ఉన్నవారు వాడితే..చర్మం మృదువుగా మారుతుంది.
2. బేసన్ వేపతో మాస్క్:
#ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక టీస్పూన్ వేప పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
#దానికి కొద్దిగా పెరుగు వేసి పేస్ట్‌లా కలుపుకోండి.
#ముందుగా మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
#ఆ తర్వాత ఈ మాస్క్‌ను బాగా అప్లై చేయాలి.
#15 నిమిషాల తర్వాత కడిగేయండి.
#ఇలా వారానికి రెండుసార్లు చేయండి.
ప్రయోజనాలు: ఈ ఫేస్ మాస్క్ మొటిమల సమస్యను తొలగిస్తుంది. ముఖంపై మచ్చలను తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
3. కలబంద వేపతో మాస్క్:
#ముందుగా ఒక గిన్నెలో ఒక చెంచా వేప పొడిని తీసుకోవాలి.
#ఇప్పుడు దానికి రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ కలపండి.
#దీని తర్వాత కొద్దిగా రోజ్ వాటర్‌తో చర్మాన్నికి మసాజ్ చేయండి.
#తర్వాత ఈ పేస్ట్‌ను మీ చర్మంపై అప్లై చేయండి.
#15 నిమిషాల తర్వాత బాగా కడగాలి.
#తర్వాత శుభ్రమైన టవల్‌తో మీ ముఖాన్ని తుడవండి.
ప్రయోజనాలు: వేప, అలోవెరా చర్మానికి మంచి మేలు చేస్తాయి. దీని ద్వారా పేరుకుపోయిన మురికిని తొలగించుకోవచ్చు.
Also Read: Curd Benefits: ఇంటీ నుంచి బయటకు వెళ్లే సమయంలో చక్కెర కలిపిన పెరుగును తినండి..!!
Also Read: Bike Stunt Viral Video: ఒకే స్కూటీపై ఆరుగురు వ్యక్తులు, ముంబై రోడ్లపై వింత విన్యాసాలు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.