Smartphone Usage: గంటల తరబడి బ్లూ స్క్రీన్స్ చూస్తే స్ట్రోక్ ముప్పుందా
Smartphone Usage: ఆధునిక జీవన విధానంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం చాలా ఎక్కువైంది. గంటలకొద్దీ మొబైల్‌కు అతుక్కుపోతున్నారు. రీల్స్ చేయడం, ల్యాప్‌టాప్‌పై గంటల తరబడి పని చేయడం ఇలా కారణం ఏదైనా బ్లూ స్క్రీన్ మాత్రం వదల్లేకపోతున్నారు. దీనికి సంబంధించి కొత్త రీసెర్చ్‌లో ఆందోళన కల్గించే అంశాలు వెలుగుచూశాయి.
Smartphone Usage: ఇటీవలి కాలంలో మొబైల్ వాడకం గణనీయంగా పెరిగింది. రోజులో 5-6 గంటలు మించి ఫోన్ వాడే పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కానేకాదు. మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్ మొత్తానికి బ్లూ స్క్రీన్‌కు ఎడిక్ట్ అవుతున్నారు. ఇది ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్పరిణామాలు కలుగజేస్తుందనే విషయంలో లక్నో కింగ్ జార్జ్ మెడికల్ కాలేజ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ చేసింది.
సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అత్యదిక సమయం మొబైల్ ఫోన్‌కు అతుక్కుపోయినవారిలో స్ట్రోక్, క్రానిక్ పెయిన్ ముప్పు తీవ్రంగా ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్య అధికమౌతుంది. అందుకే స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ కంటే డెస్క్‌టాప్ బెటర్ అంటున్నారు. లక్నో కింగ్ జార్జ్ మెడికల్ కళాశాల చేసిన అధ్యయనంలో స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉండటం వల్ల మెడ, భుజాలు, నడుము, చేతుల్లో రక్త ప్రసరణపై ప్రభావం పడుతోందని తేలింది. సోషల్ మీడియా అధికంగా వాడేవారిలో ముఖ్యంగా టీనేజర్స్‌లో ఈ సమస్య అధికంగా కన్పిస్తోందని. 15-30 ఏళ్ల వయస్సు వారిలో సర్వైకల్ స్పాండిలైటిస్ ఎక్కువగా కన్పిస్తోంది. వాస్తవానికి సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది 40-45 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా ఉంటుంది.
ఈ సమస్య నుంచి బయటపడేందుకు స్క్రీన్ సమయం తగ్గించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా వాడకం తగ్గించాలి. తప్పని పరిస్థితి అయితే డెస్క్‌టాప్ మాధ్యమం ఉపయోగించాలి. ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ కంటే డెస్క్‌టాప్ వినియోగంతో ఈ సమస్య చాలావరకు తగ్గుతుంది. ల్యాప్‌టాప్ ముందు అదేపనిగా కూర్చుని పనిచేయడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల సర్వైకల్ స్పాండిలైటిస్, స్ట్రోక్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. కంటి చూపు కూడా తగ్గుతోంది.
స్మార్ట్‌ఫోన్ ద్వారా చదివేవారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. యూట్యూబ్ రీసెర్చ్ వీడియోలు చూడటం, బాడీ పోశ్చర్ సరిగ్గా లేకుండా కూర్చోవడం వల్ల ఈ సమస్యలు పెరుగుతున్నాయి. ఇలా అన్ని రంగాల్లో పనిచేసేవారిలో ఇదే సమస్య కన్పిస్తోంది. అందుకే నిపుణులు డెస్క్‌టాప్ వాడమని సూచిస్తున్నారు.
Also read: Pomegranate Seeds: రోజూ ఒక కప్పు దానిమ్మ గింజలు తాగితే ఏమౌతుందో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.