Home Remedies for Snoring: నిద్రలో గురక పెట్టే అలవాటు చాలా మందికి ఉంటుంది. వారు గురక పెట్టడం వల్ల పక్కవారు ఇబ్బందులు పడుతారు. నిద్రపోయేటప్పుడు శ్వాసకోశ వ్యవస్థలో అడ్డంకులు ఏర్పడినప్పుడు ఈ గురక వస్తుంది. అప్పుడే చాలా మంది నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. మహిళలతో పోలిస్తే పురుషులలో ఈ గురక సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ గురక సమస్య (Snoring Problem) నుండి బయట పడాలనుకుంటే..ఈ ఇంటి నివారణలు వాడండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. పుదీనా (Mint)
పుదీనా అనేక వ్యాధులకు దివ్యౌషధం. దాని పచ్చి ఆకులను మరిగించి తాగితే గురక నయమవుతుంది. రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల పుదీనా నూనెను ముక్కులో వేసుకుంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు.


2. పసుపు (Turmeric)
పసుపు అనేక వ్యాధులను నయం చేస్తుంది. గురక సమస్యలో కూడా ఇది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇందుకోసం పడుకునే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగాలి. ఈ పసుపు పాలులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. ఇది ముక్కు దిబ్బడను తొలగిస్తుంది, ఇది గురకను ఆపివేస్తుంది. 


3. ఆలివ్ ఆయిల్ (Olive Oil)
ఆలివ్ ఆయిల్‌లోని ఔషధ గుణాల గురించి మనందరికీ తెలుసు. ఇది చర్మానికి ఉత్తమమైన మాయిశ్చరైజర్. అయితే ఆలివ్ ఆయిల్ గురకను కూడా తొలగిస్తుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. రాత్రి పడుకునేటప్పుడు ఈ నూనెను కొన్ని చుక్కలు ముక్కులో వేస్తే వాపులు తొలగిపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు.


4. వెల్లుల్లి (Garlic)
సైనస్ కూడా గురకకు కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో వెల్లుల్లిని వేయించి, నీళ్లతో కలిపి తాగితే గురక ఆగుతుంది.


Also Read: Healthy Lifestyle: నూరేళ్లు జీవించాలంటే... మీ ఆహారంలో ఈ చిన్న మార్పులు చేసుకోండి! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.