Almonds: ప్రతిరోజూ నానబెట్టిన 2 బాదంలు తింటే మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
Soaked Almonds Benefits: రోజూ నానబెట్టిన రెండు బాదంలు తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఇ, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. బాదం తీసుకోవడం వల్ల ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
Soaked Almonds Benefits: డ్రైఫ్రూట్స్‌లో బాదం ఒకటి. దీన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలుఉంటాయి. అయితే, ప్రతిరోజూ నానబెట్టిన రెండు బాదంలను డైట్లో చేర్చుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
మంచి ఆరోగ్యం..
రోజూ నానబెట్టిన రెండు బాదంలు తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఇ, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. బాదం తీసుకోవడం వల్ల ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అయితే, రాత్రి రోజు నానబెట్టినవి ఉదయం పొట్టు తీసి తినాలి. దీంతో ఆరోగ్యం కలుగుతుంది.
జీర్ణ ఆరోగ్యం..
నానబెట్టిన బాదంలను తీసుకోవడం వ్లల పేగు ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీంతో కడుపు సంబంధిత సమస్యలు మీ దరిచేరవు మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుచేస్తుంది..
బాదంలలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది ముఖంపై మచ్చలు గీతలు రాకుండా నివారిస్తుంది. బాదం తీసుకోవడం వల్ల మీ చర్మం మచ్చ లేకుండా మెరిసిపోతుంది. బాదంతో మీ చర్మంలో గ్లో కూడా వస్తుంది.
ఇదీ చదవండి: ఈ టీ జాయింట్ పెయింట్స్‌ను తగ్గించే ఎఫెక్టీవ్ రెమిడీ.. మ్యాజికల్ బెనిఫిట్స్ కలుగుతాయి..
మెదడు ఆరోగ్యం..
బాదంలో రైబోఫ్లెవిన్, ఎల్ క్యర్నైట్ ఉంటుంది. ఇది మెదడు పనితీరును కూడా మెరుగు చేస్తుంది. అంతేకాదు ఇది బ్రెయిన్ సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది. దీంతో అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా కూడా ఉంటాయి.
బరువు నిర్వహణ..
బాదంలో ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు. బరువు కూడా పెరగరు. రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేసేవారు బాదంను డైట్లో చేర్చుకోవాలి. ఇది వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి మంచిది. ఎక్కువ తినకుండా ఉంటారు. కాబట్టి బరువు సులభంగా తగ్గిపోతారు.
ఇదీ చదవండి: ఈ 5 ఆహారాలు మీకు హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తాయి.. మీ డైట్ లో తప్పక ఉండాల్సినవి..
గుండె ఆరోగ్యం..
బాదం నానబెట్ట తీసుకోవడం వల్ల ఆరోగ్యకరం. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం ఉంటుంది. ఇది బ్లడ్ సర్క్యూలేషన్‌ను మెరుగు చేస్తుంది. అంతేకాదు శరీంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి