Soaked Walnut Benefits: వాల్‌నట్‌ పోషకాలకు పవర్ హౌస్. ఈ గింజలు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. వీటిని స్నాక్ మాదిరి తీసుకున్న మంచివి. అయితే ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపున నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌  తింటే కూడా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుండె ఆరోగ్యం..
ప్రతిరోజు నానబెట్టిన వాల్నట్స్ తీసుకోవడం వల్ల ఇందులోనే ఒమేగా ఫ్లాటీ 3 ఆసిడ్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేస్తాయి. అంతేకాదు మంచి కొలెస్ట్రాయిల్ స్థాయిలను పెంచి గుండె ఆరోగ్యాన్ని ప్రేరపిస్తాయి.


మెదడు పనితీరు..
ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండే వాల్నట్స్ తీసుకోవడం వల్ల ఇందులోనే ఆంటీ ఆక్సిడెంట్లు మెదడు పని తీరుకు సహాయపడతాయి. అంతేకాదు వయససురీత్యా వచ్చే మెదడు సమస్యలను దూరం చేస్తాయి.


యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు..
వాల్నట్స్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే పాలీఫెనల్స్ ఫైటో న్యూట్రియన్స్ మంట సమస్యను తగ్గిస్తాయి. ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది.


బరువు నిర్వహణ..
 వెయిట్ లాస్ జర్నీ లో ఉన్నవారు నానబెట్టిన వాల్నట్స్ ని తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు నిర్వహిస్తుంది. వాల్నట్స్ నానబెట్టి ఒకటి తీసుకున్న గాని ఇందులో ఉండే ప్రోటీన్ ఫైబర్ మనకు ఎక్కువ సేపు ఆకలి వేయనివ్వదు. దీంతో క్యాలరీలు అతిగా తినడం తగ్గిస్తాం.


మెరుగైన జీర్ణక్రియ
వాల్ నట్స్ నానబెట్టి తీసుకోవటం వల్ల ఇది మజీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఖనిజాలను గ్రహిస్తుంది వాల్నట్స్ లో ఫైబర్ మన మంచి జర్ణక్రియకు ప్రేరేపిస్తాయి.


ఇదీ చదవండి: క్యాల్షియం పుష్కలంగా ఉండే 7 ఆహారాలు.. ఇవి ఎముక ఆరోగ్యానికి ఎంతో మేలు..


ఎముక ఆరోగ్యం..
వాల్‌నట్‌  లో పుష్కలమైన ఖనిజాలు ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇది మన శరీరానికి ఎంతో ఎముకలకు అవసరం ఇది ఆరోగ్యకరమైన ఎముకకు సహాయపడతాయి.


చర్మ ఆరోగ్యం..
వాల్‌నట్‌  యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్‌ ఇ చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతం చేస్తుంది. ముఖ్యంగా ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.


షుగర్ కంట్రోల్..
వాల్‌నట్‌  గ్లైసోమిక్ సూచి తక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగనివ్వవు. డయాబెటీస్‌తో బాధపడేవారు నానబెట్టిన వాళ్లనే ఉదయం ఒకటి చొప్పున తీసుకున్న ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.


ఇదీ చదవండి: బీన్స్‌ తింటే ఆ మందులు వాడాల్సిన అవసరంలేదు.. మీకు తెలియని ప్రయోజనాలు కూడా పుష్కలం..


మంచి నిద్ర..
వాల్నట్ లో సహజసిద్ధమైన మెలోటినైన్ ఉంటుంది. ఇది హార్మోను మంచి నిద్రకు ప్రేరేపిస్తుంది. దీంతో మీ నిద్ర సైకిల్‌  నిర్వహిస్తుంది. మంచి నిద్ర పట్టడానికి సహాయపడుతుంది.


యాంటీ ఆక్సిడెంట్..
వాల్నట్స్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పాలీఫెనాల్స్ శరీరాన్ని ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌, ప్రాణాంతక వ్యాధులు రాకుండా కాపాడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి