Beans Health Benefits: బీన్స్ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు బీన్స్ లో ఫోలేట్ మన శరీరానికి కావాల్సిన విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఏ ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ గ్రీన్ బీన్స్ మన పేగు ఆరోగ్యానికి మంచిది. పేగు కదలికలకు తోడ్పడుతుంది. ఇది జీర్ణక్రియకును మెరుగు చేస్తుంది. బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రాణాంతక జబ్బుల నుంచి దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ గుండె సమస్యలతో బాధపడేవారు ఆక్సిడెంట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ,మంట నుంచి ఇది నివారిస్తుంది.
గ్రీన్ బీన్స్ లో వెజిటేరియన్స్ వారికి ఎంతో ఆరోగ్యకరం ఇందులో ప్లాంట్ బెస్ట్ ప్రోటీన్ ఉంటుంది. అందుకే తప్పకుండా మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే బీన్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి ఏ ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
క్యాన్సర్..
గ్రీన్ బీన్స్ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యకు మంచి నివారణ అంతేకాదు పేగు ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. ఇందులో యాంటీ ఇన్ల్పమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయని ఎన్ఐహెచ్ నివేదిక తెలిపింది.
గ్యాస్ సమస్యలు..
గ్రీన్ బీన్స్ లో రెండు కరిగే, కరగని రెండు ఫైబర్స్ ఉంటాయి. ఇది శరీర ఆరోగ్యానికి జీర్ణక్రియ జీర్ణ వ్యవస్థకు ఎంతో మంచివి ఇది డైజెస్టివ్ క్యాన్సర్ నుంచి కూడా కాపాడతాయి.
ఆరోగ్యకరమైన ఎముకలు..
గ్రీన్ బీన్స్ లో విటమిన్ కె, క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇది ఆరోగ్యకరమైన ఎముకలకు ఎంతో ముఖ్యం అంతే కాదు ఇందులో ఫైటెట్ కూడా ఉంటుంది. ఇది తప్పకుండా డైట్ లో ఉండాల్సిన ఆహారం అని ఎన్ ఐహెచ్ నివేదిక తెలిపింది.
ఇదీ చదవండి:ఆల్కహాల్ కాదు ఈ 5 ఆహారాలు తీసుకుంటే మీ లివర్ డ్యామేజ్ అయినట్టే..
బరువు తగ్గడం..
గ్రీన్ బీన్స్ క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు కూడా సులభంగా తగ్గుతారు. మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఈ క్యాలరీలు తక్కువ ఉండే ఆహారం బరువు పెరగకుండా కాపాడుతుంది. అంతేకాదు గ్రీన్ బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇది ప్రాణాంతక జబ్బులు క్యాన్సర్ గుండె వ్యాధుల నుంచి కాపాడుతాయి.
ఇమ్యూనిటీ బూస్ట్..
గ్రీన్ బీన్స్ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.
ఇదీ చదవండి:క్యాల్షియం పుష్కలంగా ఉండే 7 ఆహారాలు.. ఇవి ఎముక ఆరోగ్యానికి ఎంతో మేలు..
కంటి ఆరోగ్యం..
గ్రీన్ బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్, లూటీన్,జియాన్తీన్ ఉంటుంది. ఇది వయస్సురీత్యా వచ్చే కంటి జబ్బుల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి గ్రీన్ బీన్స్ టైప్ లో చేర్చుకోవాలని ఎన్ ఐహెచ్ నివేదిక తెలిపింది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి