Soft Drinks Side Effects: కూల్ డ్రింక్స్ తాగుతూన్నారా? ఇవి తెలిస్తే అస్సలు తాగరు!
Soft Drinks Side Effects In Telugu: ప్రతి రోజు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారీ తీస్తుంది. అంతేకాకుండా శరీర బరువును కూడా పెంచుతాయి. దీంతో పాటు కొలెస్ట్రాల్‌ను కూడా పెంచుతాయి.
Soft Drinks Side Effects In Telugu: పిల్లల నుంచి పెద్దవారి వరకు కూల్ డ్రింక్స్ ఎంతో ఇష్టపడి తాగుతూ ఉంటారు. నిజానికి ప్రతి రోజు కూల్ డ్రింక్స్ తాగేవారు కూడా ఉంటారు. ఇలా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే రసాయనాలు ఎముకల సమస్యలతో పాటు ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారీ తీస్తుంది. రోజు కూల్‌డ్రిక్స్ తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కూల్ డ్రింక్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు:
బరువు పెరుగుదల:
కూల్ డ్రింక్స్‌లో అధికంగా ఉండే ఫ్రక్టోజ్ అనే చక్కెర మెదడుకు సంతృప్తిని అతలకుతలం చేసేందకు దారీ చూపుతుంది. కాబట్టి ప్రతి రోజు కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల సుభంగా శరీర బరువు పెరుగుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులకు కూడా దారీ తీస్తుంది.
మధుమేహం:
ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అధిక చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో పాటు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. కొంతమందిలో అధిక ఫ్రక్టోజ్ కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేసి, తీవ్ర మూత్రపిండాల సమస్యలకు దారీ తీస్తుంది.
దంతాల ఆరోగ్యంపై ప్రభావం:
కూల్ డ్రింక్స్‌లోని ఆమ్లాలు దంతాల ఎనామిల్‌ను కరిగించి, దంత క్షయానికి దారితీస్తాయి. కూల్ డ్రింక్స్‌లోని రంగులు దంతాల రంగును మార్చి, మచ్చలు ఏర్పడేలా చేస్తాయి. అంతేకాకుండా దంతాలు పుచ్చిపోయేలా చేస్తాయి.
ఎముకల ఆరోగ్యంపై ప్రభావం:
ఈ డ్రింక్‌లో ఉండే ఫాస్ఫారిక్ ఆమ్లం శరీరంలో కాల్షియంను తగ్గించి, ఎముకలను బలహీనపరుస్తుంది. అంతేకాకుండా ఎముకల సాంద్రత తగ్గడం వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇవే కాకుండా ఇతర ఎముకల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
హృదయ ఆరోగ్యంపై ప్రభావం:
ప్రతి రోజు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అధిక చక్కెర రక్తపోటును పెంచి, హృదయ స్పందన రేటును పెంచుతుంది. కూల్ డ్రింక్స్‌లోని కొవ్వులు రక్తనాళాల్లో పేరుకుపోయి, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.
మెదడు ఆరోగ్యం:
అధిక చక్కెర మెదడులోని నరాల కణాలను దెబ్బతీసి, జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. కూల్ డ్రింక్స్‌ను అధికంగా తాగడం వల్ల మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.