Strawberries: ఫిబ్రవరి-మార్చిలో దొరికే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు.. మీరు కూడా తెలుసుకోండి..!
Strawberries Benefits: సీజన్లలో దొరికే పండ్లను తప్పకుండా తినడమే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అందులోను స్ట్రాబెర్ పండును తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది. స్ట్రాబెరీలో అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఇవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం...
Strawberries Benefits: స్ట్రాబెర్ పండు ఎక్కువగా ఫిబ్రవరి-మార్చిలో దొరికే పండు. ముఖ్యంగా స్ట్రాబెర్రీని ఐస్క్రీంలలో,స్మూతీస్, మిల్క్ షేక్ లలో ఉపయోగిస్తారు. ఇతర పండ్ల లాగే స్ట్రాబెర్రీలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో కూడా ఉన్నాయి. స్ట్రాబెర్రీస్ లో ఉండే పోషకాలు అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
✦ ఈ పండ్లల్లో విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
✦ స్ట్రాబెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల కణాల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది.
✦ ఈ పండు తీసుకోవడం వల్ల డయాబెటిస్, గుండె సమస్యలు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
✦ అలాగే స్ట్రాబెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
✦ స్ట్రాబెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
Also read: Vitamin D: విటమిన్ డి ఎక్కువైతే ఏమౌతుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలెదురౌతాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook