Strawberry Health benefits: స్ట్రాబెరీ పండ్లు రుచిగా ఉంటాయి. చూడ్డానికి కూడా పింక్ రంగులో అందంగా కనిపిస్తాయి. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్ సి అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు స్ట్రాబెర్రీలు తింటే ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆక్సిడేటీవ్ స్ట్రెస్ నుంచి కాపాడతాయి. స్ట్రాబెరీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ ఆరోగ్యంతో పాటు బరువు నిర్వహణ కూడా తోడ్పడుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. స్ట్రాబెరీ లో ఫోలెట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరుకు కూడా సహాయపడుతుంది. ఈ బెర్రీ పండును మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల రుచిగా ఉండటమే కాకుండా మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు. దీంతో మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుండె ఆరోగ్యం..
స్ట్రాబెర్రీలను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో పాలిఫైనల్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థతో పాటు మీ శరీర పనితీరు మెరుగుపరుస్తాయి. బ్లడ్ ప్రెషర్ మీ కంట్రోల్ నివారించి మంచి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయని ఎన్ ఐ హెచ్ తెలిపింది.


క్యాన్సర్ కు వ్యతిరేకం..
స్ట్రాబెర్రీలో ఉండే ఎలర్జిక్ యాసిడ్ చర్మ, కాలేయ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. అంతేకాదు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా నివారిస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి కూడా ఉంటుంది ఇది యాంటీక్యాన్సర్ లాగా పని చేస్తుంది.


బలమైన ఇమ్యూనిటీ వ్యవస్థ..
ఒక కప్పు స్ట్రాబెర్రీలు తీసుకోవడంలో అందులో ఉండే విటమిన్ సి ఆరెంజ్ కంటే ఎక్కువగా ఉంటుందంట. ఈ  విటమిన్ మన ఆంటీ బాడీస్ బలపరిచి ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా సహకరిస్తుంది. దీంతో మనకు సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుందని ఎన్ఐహెచ్ తెలిపింది.


ఇదీ చదవండి:  బిర్యానీ ఆకు కషాయం.. వంద రోగాలను నయం చేసే ఆయుర్వేద పానీయం..


మెదడుకు మేలు..
స్ట్రాబెరీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇది మెదడు పనితీరుకు సహకరిస్తుంది. మెదడు కణాల అభివృద్ధికి ఆ ఫ్రీ రాడికల్ రాకుండా న్యూరోనాల్ కమ్యూనికేషన్ కు సహాయపడుతుంది.


ఇదీ చదవండి:  మలబద్ధకం సమస్య మందులతో తగ్గటం లేదా? ఈ గింజలు వాడి చూడండి..


వెయిట్ లాస్..
స్ట్రాబెరీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎలాజిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇది తింటే కడుపు ఎక్కువ శాతం నిండిన అనుభూతి కలుగుతుంది. బరువు పెరగకుండా ఉంటారు డైట్ లో చేర్చుకోవడం వల్ల ఫ్యాట్ కరిగిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి