Constipation Remedies: మలబద్ధకం సమస్య మందులతో తగ్గటం లేదా? ఈ గింజలు వాడి చూడండి..

Nuts for Constipation Relief: మలబద్ధకం అనేది జీర్ణ ఆరోగ్య సమస్య. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది మన డైలీ రొటీన్ లైఫ్ పై ప్రభావం చూపుతుంది. ఎన్నో మందులు వాడిన దీర్ఘకాలికంగా మలబద్ధకంతో బాధపడేవారు ఉన్నారు.

Written by - Renuka Godugu | Last Updated : May 31, 2024, 09:09 AM IST
Constipation Remedies: మలబద్ధకం సమస్య మందులతో తగ్గటం లేదా? ఈ గింజలు వాడి చూడండి..

Nuts for Constipation Relief: మలబద్ధకం అనేది జీర్ణ ఆరోగ్య సమస్య. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది మన డైలీ రొటీన్ లైఫ్ పై ప్రభావం చూపుతుంది. ఎన్నో మందులు వాడిన దీర్ఘకాలికంగా మలబద్ధకంతో బాధపడేవారు ఉన్నారు. అయితే కొన్ని రకాల గింజలతో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు ఉండటం వల్ల దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు చెక్‌ పెడతాయి. ఆ గింజలు ఏంటో తెలుసుకుందాం.

అవిసె గింజలు..
అవిస గింజల్లో కరిగే, కరిగేని ఫైబర్స్ రెండు ఉంటాయి. ఇది మలబద్ధక సమస్యలకు ప్రభావంవంతమైన రెమిడీ. ఇందులో కరిగే ఫైబర్ జెల్ లాగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యానికి కదలికకు సహకరిస్తుంది. ఇక కరగాని ఫైబర్ మలబద్ధకానికి చెక్ పెడుతుంది అవిసె గింజలను నానబెట్టి తీసుకోవడం వల్ల ఇది ఖనిజాలను గ్రహిస్తుంది. అంతేకాదు అవిసె గింజలను స్మూతీస్, యోగార్ట్‌, ఓట్ మిల్ వంటి ఆహారాల్లో కూడా కలిపి తీసుకోవచ్చు.

చియా సీడ్స్..
ఫైబర్ పుష్కలంగా ఉండే మరో ఆహారం చియా సీడ్స్. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది జీవన ఆరోగ్యానికి మంచివి. చియాసీడ్స్ లో కూడా జెల్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కదలికలకు ప్రేరేపిస్తుంది. అంతే కాదు ఇది హైడ్రేషన్ అందిస్తుంది. చియా సీడ్స్ నానబెట్టి మన ఆహారంలో తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక మలబద్ధ సమస్యకు చెక్ పెట్టొచ్చు వీటిని సలాడ్స్, పుడ్డింగ్ లలో  తీసుకోవచ్చు.

నువ్వులు..
మన ఇంట్లో అందుబాటులో ఉండే నువ్వుల్లో పోషకాలకు పవర్ హౌస్. ఇందులో ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నువ్వులు మన డైట్లో చేర్చుకోవడం వల్ల పేగు కదలికలకు సహకరిస్తుంది. అంతేకాదు ఇది మలబద్ధక సమస్యకు మంచి ప్రభావం అంతమైన రెమెడీ. ఇందులో ఉండే లిగనన్స్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతాయి. మనం ఏదైనా తీసుకునే సలాడ్స్ లో ఈ నువ్వులను చల్లుకొని తీసుకోవాలి. యోగర్ట్‌తోపాటు కూడా తీసుకోవచ్చు.

ఇదీ చదవండి: బిర్యానీ ఆకు కషాయం.. వంద రోగాలను నయం చేసే ఆయుర్వేద పానీయం..

సన్ ఫ్లవర్ సీడ్స్..
సన్ ఫ్లవర్ సీడ్స్ రుచికరంగా ఉండటమే కాకుండా ఇది జీర్ణ ఆరోగ్యానికి మంచిది. సన్ఫ్లవర్ సీడ్స్ లో ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, దీర్ఘకాలిక మలబద్ధ సమస్యకు ఎఫెక్టివ్ రెమిడీ. అంతేకాదు ఇది కడుపులో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడుతుంది. సన్ఫ్లవర్ సీడ్స్ లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది వేయించిన సన్ఫ్లవర్ సీడ్స్ ని స్నాక్స్ లా తీసుకోవచ్చు.

ఇదీ చదవండి: స్మోకింగ్‌ చేసేవారికి 5 అనారోగ్య సమస్యలు తప్పవు.. ఈ లక్షణాలు కనిపిస్తే జరభద్రం..

గుమ్మడి గింజలు..
గుమ్మడి గింజల్లో పెప్టస్ ఉంటుంది. ఇది పోషకాలకు పవర్ హౌస్ మలబద్ధక సమస్యకి ఎఫెక్టీవ్ రెమిడీ. గుమ్మడి గింజలో ఫైబర్ ,ప్రోటీన్ ,ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రెగ్యులర్ పేగు ఆరోగ్యకరమైన కదలికలకు సహకరిస్తాయి. ఫైబర్ మెగ్నీషియం కలగలిపి గుమ్మడి గింజల్లో ఉండటం వల్ల పేగు కదలికలకు ప్రభావంతంగా పనిచేస్తుంది. గుమ్మడి గింజలను కూడా మనం తీసుకునే సూప్స్ లో తీసుకోవచ్చు స్నాక్ గా కూడా పనిచేస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News