Bay Leaf Water health benefits: సాధారణంగా మనం బిర్యానీ ఆకుని వంటలో వినియోగిస్తాం. అయితే బిర్యానీ ఆకుతో తయారు చేసిన నేటి నుంచి పరగడుపున తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రతిరోజు ఈ బే లీఫ్ నీటిని తాగడం వల్ల శరీర ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మంచి జీర్ణక్రియకు ప్రోత్సహించి కడుపులో అజీర్తి, కడుపునొప్పి సమస్యలను తగ్గిస్తుంది.
అంతేకాదు ఈ బే లీఫ్ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతాయి. బిర్యానీ ఆకు కషాయం బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నిర్వహిస్తాయి. డయాబెటిస్తో బాధపడేవారు షుగర్ కంట్రోల్ చేసుకోవాలనుకునేవారు డైలీ వాటర్ ఈ నీటిని తాగాలని వెబ్ ఎండీ తెలిపింది.బిర్యానీ ఆకుతో నీటిని తయారు చేసుకోవడానికి వేడి నీటిలో బిర్యానీ ఆకుని వేసుకొని కొన్ని నిమిషాల పాటు మరిగించుకోవాలి.. చల్లారిన తర్వాత పరగడుపున తీసుకోవాలి. దీంతో కలిగే ఆరు ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
చర్మ ఆరోగ్యం..
బిర్యానీ ఆకు నీటిని తీసుకోవటం వల్ల స్ట్రెస్ తగ్గిపోతుంది. ముఖంపై వలయాలు, మచ్చలు, గీతాలు రాకుండా నివారిస్తుందని ఎన్ఐహెచ్ తెలిపింది. ఈ నీటిని తీసుకోవడం వల్ల మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.
జీర్ణ ఆరోగ్యం..
బిర్యానీ ఆకుతో తయారు చేసిన నీటిని తీసుకోవడం వల్ల సైనస్ సంబంధించిన సమస్యలు కూడా ఉపశమనం కల్పిస్తుంది. ఈ బిర్యానీ ఆకు వాటర్ వల్ల ముక్కులోని శ్వాస మార్గాలు విస్తరింపబడతాయి.
ఇదీ చదవండి: చీజ్ ఎముకలకు బలం.. మీ డైట్లో చీజ్ చేర్చుకుంటే 5 ఆరోగ్య ప్రయోజనాలు..
క్యాన్సర్ ప్రమాదం..
బిర్యానీ ఆకు నీటిని పరగడుపున తీసుకోవడం వల్ల ఇది యాంటీ క్యాన్సర్ డ్రగ్ మాదిరి పనిచేస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది ముఖ్యంగా ల్యూకేమియా, బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యలకు మంచి రెమిడీ. ఈ బే లీఫ్ నీటిని మీ డైట్ లో చేర్చుకుంటే కడుపు సంబంధించిన క్యాన్సర్ కూడా ఎఫెక్టీవ్ రెమిడీ.
డయాబెటిస్..
బిర్యానీ ఆకు గ్లూకోజ్,మెటబాలిజం నియంత్రిస్తుంది. అంతేకాదు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గించేస్తుంది. రక్తంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది టైప్ 2 డయాబెటిస్ వారికి ఇది ఎఫెక్టీవ్ రెమిడీ. దీంతో బరువు కూడా సులభంగా తగ్గిపోతారని NIH తెలిపింది.
ఇదీ చదవండి: స్మోకింగ్ చేసేవారికి 5 అనారోగ్య సమస్యలు తప్పవు.. ఈ లక్షణాలు కనిపిస్తే జరభద్రం..
ఇమ్యూనిటీ వ్యవస్థ..
బిర్యానీ ఆకులో విటమిన్ ఏ, బి6, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల మన ఇమ్యూనిటీ వ్యవస్థ మెరుగవుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి