Stress Reduce: స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోయిందా? ఈ 5 ఆహారాలు తింటే మంచి ఉపశమనం లభిస్తుంది..
Stress Reduce foods: స్ట్రెస్ తగ్గించుకోవాలంటే చక్కర అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి ట్రాన్స్ ఫ్యాట్ ఉండే ఆహారాలు కూడా తీసుకోవచ్చు దీంతో ఈజీగా స్ట్రెస్ తగ్గించుకోవచ్చు.
Stress Reduce foods: స్ట్రెస్ విపరీతంగా పెరుగుతుంది. ఇది మన బిజీ లైఫ్ వల్ల, ఇంట్లో గొడవలు ఇంకా ఏమైనా సమస్యలు కావచ్చు. యాంగ్జైటీ పెరగటం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే కొన్ని ఆహారాలతో ఈ సమస్యకు దూరంగా ఉండవచ్చు. బెర్రీస్, గింజలు, విత్తనాలు, విటమిన్ ఏ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మూడు నియంత్రణలో ఉంటుంది.
స్ట్రెస్ తగ్గించుకోవాలంటే చక్కర అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి ట్రాన్స్ ఫ్యాట్ ఉండే ఆహారాలు కూడా తీసుకోవచ్చు దీంతో ఈజీగా స్ట్రెస్ తగ్గించుకోవచ్చు.
బెర్రీ జాతికి చెందిన పండ్లతో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్ట్రెస్ నుంచి రిలీఫ్ తక్షణమే అందిస్తాయి స్ట్రాబెరీ, బ్లూబెర్రీ వంటి బెర్రీలను చేర్చుకోవాలి.
జింక్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల యాంగ్సైటి తగ్గిపోతుంది. ముఖ్యంగా జీడిపప్పులో జింక్ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి ఈ ఆహారాలు డైట్ లో చేర్చుకోవాలి.
అంతేకాదు స్ట్రెస్ సమస్య తగ్గించుకోవడానికి మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఆహారాలు డైట్ లో చేర్చుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా చియాసీడ్స్, గుమ్మడి గింజలు గుడ్లలో మెగ్నీషియా పుష్కలంగా ఉంటుంది ఇది మూడు మెరుగుపరుస్తుంది.
ఇదీ చదవండి: బియ్యంపిండితో ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోండి..
గుడ్లలో ట్రిప్టోఫన్ ఉంటుంది. ఇది సెరోటినైన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. మూడ్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది. గుడ్లను డైట్ లో చేర్చుకోవాలి. అంతేకాదు అవకాడో కూడా స్ట్రెస్ నుంచి బయటపడేస్తుంది. ఇందులో ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ b6 ను యాంగ్జైటీ తగ్గించేసి బ్లడ్ ప్రెషర్ ని కూడా తగ్గించేస్తుంది.
ఇదీ చదవండి: వర్షా కాలంలో ఈ ఆహారాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
అంతే కాదు ఫోలేట్ పుష్కలంగా ఉండే ఆకుకూరల్లో కూడా స్ట్రెస్ నయం చేసే గుణాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఫోలెట్ ఉంటుంది. ఇది న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తికి తోడ్పడతాయి.
సాల్మన్ లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా సార్డైన్స్ చేపలు విటమిన్-డి ఉంటుంది ఇది మూడు డిజార్డర్ నుంచి కాపాడుతుంది సాల్మన్ ఫిష్ కూడా మీ డైట్ లో చేర్చుకోవాలి
అంతేకాదు పాలలో కూడా ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ట్రిప్టోప్యాడ్ మైలో టైనైన్ విటమిన్ బి ఉంటుంది ఇది త్వరగా స్ట్రెస్ తగ్గించి నిద్రకూ ఉపక్రమించేలా సహాయపడుతుంది కూడా(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి